Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్: రూ.8 కోట్లు నష్టపోయిన మంత్రి ఈటల
By: Tupaki Desk | 7 March 2020 6:15 AM GMTకరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి రంగం పై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ప్రపంచంలోని అపర కుబేరుల లక్షల కోట్ల ఆస్తి కరోనా ఎఫెక్ట్ తో ఆవిరై పోయింది. ఈ కరోనా ఎఫెక్ట్ తో ఆర్థిక వ్యవస్థ పై తీవ్రంగా ఉందని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా దెబ్బకు రాష్ట్రంలో వివిధ రంగాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా కోళ్ల పరిశ్రమ బాగా దెబ్బతిన్నది. అంతేకాక, గ్రానైట్, ఫార్మా, హోటల్స్ వరకూ అన్ని పరిశ్రమలూ కరోనా దెబ్బకు నష్ట పోతున్నాయి. కానీ అత్యధిక ప్రభావం మాత్రం మాత్రం పౌల్ట్రీ రంగంలోనే ఉంది..చైనాలో కరోనా రాగానే ఆ ప్రభావం.. పౌల్ట్రీ పరిశ్రమ పై పడింది. రిటైల్ కౌంటర్లలో చికెన్ అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 7 లక్షల బ్రాయిలర్ కోళ్లు విక్రయం అయ్యేవని, వీటి అమ్మకాలు పడి పోయాయని అంటున్నారు.
తెలంగాణలోనూ కరోనా వైరస్ ను గుర్తించాక ఆ ప్రభావం మరింత పెరిగింది. రిటైల్ దుకాణాల్లో చికెన్ అమ్మకాలు దాదాపు సగం పడిపోయాయి. ఇదే పరిస్థితి నెలకు మించి కొనసాగితే మాత్రం మరిన్ని కష్టాలు, తీవ్ర నష్టాలు తప్పవని పౌల్ట్రీ పరిశ్రమ కు చెందినవారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ వ్యాపారంలో ఉన్న మంత్రి ఈటల రాజేందర్ సైతం... కరోనా కారణంగా భారీగా నష్ట పోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. కరోనా కారణంగా తాను కూడా వ్యాపారపరంగా దాదాపు రూ. 8 కోట్లు నష్ట పోయినట్టు తెలిపారు. మిగతా రంగాలతో పోలిస్తే కరోనా కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ ఎక్కువగా నష్ట పోతోంది అని అన్నారు.
చికెన్ తినడం వల్ల కరోనా వ్యాపిస్తుందనే పుకార్లు మొదలు కావడంతో... కొద్ది రోజులుగా చికెన్ అమ్మకాలు బాగా పడిపోయాయి. దీంతో ధరలు కూడా బాగా తగ్గాయి. ప్రజల్లో ఉన్న ఈ భయాలను పోగొట్టేందుకు చికెన్ మేళాను కూడా నిర్వహించారు పౌల్ట్రీ యజమానులు. దీని వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందని అంచనా వేశారు. కానీ అంతలోనే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో... ప్రజల్లో కరోనా వైరస్ పట్ల ఉన్న భయాందోళనలు మరింత పెరిగిపోయాయి. మరోవైపు, హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగికి కరోనా సోకినట్లు వచ్చిన వార్తలతో హైటెక్ సిటీ ప్రాంతంలోని స్టార్ హోటళ్లలో ముందస్తు బుకింగ్ చేసుకున్న రూంలన్నీ రద్దయిపోయాయి. ఐటీ కంపెనీలు తమ మీటింగ్‌లు, ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నందున హోటల్ పరిశ్రమ పై తీవ్రంగా ప్రభావం పడింది. మొత్తంగా కరోనా ప్రభావం ఒక్క రంగంపైనే కాదు అన్ని రంగాలపై ఉంది .