Begin typing your search above and press return to search.
వెయేళ్ల యుద్ధం చేస్తామని కోతలు కోసిన గడ్డలో పిల్లల పుస్తకాలకు పేపర్ లేని దుస్థితి
By: Tupaki Desk | 25 Jun 2022 10:30 AM GMTదాయాది పాకిస్థాన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశంలో.. తాజాగా కాగితం కొరత అంతకంతకూ పెరిగి పెద్దది అవుతోంది. కొత్త విద్యా సంవత్సరంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన పేపర్ అందుబాటులో లేని దుస్థితి.
కాగితం సంక్షోభం పాక్ కు షాకుల మీద షాకులు ఇస్తోంది. దీంతో.. ఈసారికి స్కూళ్లకు వెళ్లే పిల్లల టెస్టు పుస్తకాలకు పేపర్ కొరత తప్పదని.. బుక్స్ ను ప్రింట్ చేయటం సాధ్యం కాదని చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పలు దేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ కు.. ఉన్న దరిద్రాలు చాలవన్నట్లు తాజాగా కాగితం కొరత ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి తోడు పాక్ ప్రభుత్వ తప్పుడు విధానాలు..
స్థానిక పేపర్ పరిశ్రమల కక్కుర్తి.. వెరసి ఇప్పుడు పేపర్ సంక్షోభం ఆ దేశంలో ఆకాశాన్ని అంటింది. తాజాగా ప్రముఖ ఆర్థిక వేత్త డాక్టర్ ఖైజర్ మీడియాతో మాట్లాడారు.
పేపర్ సంక్షోభం కారణంగా ఈ ఏడాది పిల్లల టెస్టు పుస్తకాల్ని ప్రింట్ చేయలేని పరిస్థితి నెలకొందని.. పేపర్ చాలా ఖరీదైన వస్తువుగా మారుతుందన్నారు. ప్రచురణ కర్తలు.. పుస్తకాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ..
పేపర్ తయారీదారుల్ని ప్రభుత్వం నియంత్రించలేకపోవటం ఇప్పుడో సమస్యగా మారింది. భారత్ తో వెయ్యేళ్లు యుద్ధం చేస్తానని బీరాలు పలికిన దాయాది ఇప్పుడు ఎలాంటి దీన స్థితిలో నిలిచారో అర్థమవుతుంది. అందుకే.. యుద్ధం.. ఉగ్రవాదాన్ని నమ్ముకుంటే నిలువునా మునిగిపోయినట్లే. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఎంత త్వరగా తన తీరును మార్చుకుంటే.. ఆ దేశానికి అంత మంచిది.