Begin typing your search above and press return to search.
కరెంటు మంత్రి.. నీళ్ల మంత్రి.. టీఆర్ఎస్ సర్కారులో భలే పేర్లు
By: Tupaki Desk | 15 March 2022 10:01 AM GMTముద్దు పేర్లు.. ముచ్చట గొలుపుతుంటాయి. అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలనయితే నోరారా ముద్దు పేర్లతో పెంచుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో నాని, చంటి, పండు, బుజ్జి, కన్నా, నాన్న.. ఇలాంటి ఎన్నో ముద్దు పేర్లు వాడుకలో ఉన్నాయి. కొంతమంది ఎంత పెద్దయినా చివరకు వారికి ఆ ముద్దు పేర్లే స్థిరపడిపోతుంటాయి. ఉదాహరణకు.. సినిమాల్లో సాధారణ యువకుడిగా ఎంట్రీ ఇచ్చి, నేచురల్ స్టార్ గా ఎదిగిన "నాని". చల్లపల్లికి చెందిన నాని అసలు పేరు గంటా నవీన్. కానీ, ఇంట్లో పిలుచుకునే ముద్దు పేరే సినిమా పేరుగా స్థిరపడింది. అయితేనేం.. తన చక్కటి నటనతో నాని ఎక్కడికో వెళ్లిపోయాడు. మిగతా సినిమా అంతా ఒక ఎత్తు, నాని నటన ఒక ఎత్తు తరహాలో ఉంటుంటాయి సినిమాలు. ఇక ఇదే ముద్దుపేర్ల కల్చర్ రాజకీయాల్లోనూ కనిపిస్తుండడం కాస్త చెప్పుకోదగ్గ విశేషం. అదెలాగంటే..
కరెంటు మంత్రి
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన గుంటకండ్ల జగదీశ్ రెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగానూ పేరుంది. సూర్యాపేట నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన జగదీశ్ రెడ్డికి టీఆర్ఎస్ మొదటి విడత సర్కారులోనే మంత్రి పదవి దక్కింది. అయితే, విద్యుత్తు శాఖ మంత్రిగా మంచిపేరు తెచ్చుకున్నారాయన. సహజంగానే తెలంగాణ వచ్చాక విద్యుత్తు రంగం ఎలా ఉంటుందో అన్న ప్రశ్న తలెత్తింది. దీనికితోడు ఉమ్మడి ఏపీలో ఉండగా.. తెలంగాణ ఏర్పాటైతే కరెంటుకు కటకటే అనే ప్రచారం సాగింది.
కానీ, కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ సర్కారు దీనిని పటాపంచలు చేసింది. అంతకుముందటి ప్రభుత్వాలకు సాధ్యం కాని దానిని చేతల్లో అదీ కొద్ది రోజుల్లోనే చేసి చూపింది. 2012, 2013 సంవత్సరాల్లో ఉమ్మడి ఏపీ కరెంటు కోతలతో తీవ్రంగా ఇబ్బందులు పడింది. పటాన్ చెరు వంటి చోట్ల ఏకంగా పరిశ్రమలే మూతపడ్డాయి. కానీ, తెలంగాణ వచ్చాక కరెంటు కోతన్నదే కనిపించడం లేదు. విద్యుత్తు రంగంలో అంతగా స్వయం సత్తా సాధించింది తెలంగాణ. దీంతో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠ పెరిగింది. కాగా, విద్యుత్తు మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డిని కేసీఆర్ ఓ సభలో "కరెంటు మంత్రి"అని సంబోధించడం గమనార్హం.
నీళ్ల మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిరంజన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ఆవిర్బాభవం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలో కీలక పాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తులు కూడా. ఓ విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ఉన్నత స్థాయి నాయకత్వంలో నిరంజన్ రెడ్డి ఒకరు. ఈయన వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తొలిసారి గెలిచినప్పటికీ 2018లో కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన వ్యవసాయ శాఖ ఇచ్చారు. అయితే, నిరంజన్ రెడ్డిని ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్ల మంత్రి అంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరువుకు పెట్టింది పేరు. సాగునీటి వనరులు లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. లక్షల మంది వలస పోయేవారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు పాలమూరు వాసులు అక్కడే పని వెదుక్కుంటున్నారు. దీనంతటికీ కారణం ప్రాజెక్టులు పూర్తి కావడం. కాగా, ఈ ప్రాజెక్టుల కింద నీళ్లు పారిస్తూ కాల్వలను నింపడానికి తోడు, మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేశారు.
సహజంగానే మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి మరికాస్త చొరవ చూపి ఎక్కువ నిధులతో పనులు చేయించారు. అంతేగాక, కార్యాలయంలో ఉన్నా, కారులో ఉన్నా వీడియో కాల్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ వస్తున్నారు. దీంతో పొలాలకు నీళ్లు పారే మార్గం ఏర్పడుతోంది. దీంతో ఆయనను "నీళ్ల మంత్రి" అంటున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ రెండో విడత ప్రభుత్వంలో సాగునీటి శాఖ కు ప్రత్యేకంగా మంత్రి అంటూ ఎవరూ లేరు. సీఎం కేసీఆర్ ఈ శాఖను స్వయంగా చూస్తున్నారు. దీనికితోడు గత విడతలో సాగునీటి మంత్రిగా ఉన్న హరీశ్ రావు ప్రస్తుతం ఆర్థిక, వైద్య శాఖలను పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి నిరంజన్ రెడ్డిని నీళ్ల మంత్రిగా పిలిచినా ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండడం లేదు. ఇక జగదీశ్ రెడ్డి మొదటినుంచీ విద్యుత్తు శాఖ మంత్రి కావడంతో ఇక ఎలాంటి ఇబ్బందీ కనిపించడం లేదు.
కంపెనీల బాగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ కు చెందిన పెద్ద నేత ఎం.బాగారెడ్డి. ఈయన ఏడెనిమిదిసార్లు ఎంపీగా, పలుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనను కంపెనీల బాగారెడ్డిగా మెడక్ జిల్లాలో పిలిచేవారు. బాగారెడ్డి కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఉన్న సమయంలో మెదక్ జిల్లాకు పరిశ్రమలను పెద్ద సంఖ్యలో తెచ్చారు. ఇప్పుడున్న పటాన్ చెరు పారిశ్రామిక వాడ నుంచి అనేక పెద్ద సంస్థలు బాగారెడ్డి హయాంలో ఏర్పాటైనవే. అందుకోసమే ఆయనకు కంపెనీల బాగారెడ్డిగా పేరొచ్చింది. జహీరాబాద్ కే చెందిన మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్నకు బండ్ల బాగన్నగా పేరుంది. ఈయన సరుకు రవాణాకు ఎడ్ల బండిని ఎక్కువగా ఆశ్రయించేవారు. దీంతో ఆ పేరొచ్చింది