Begin typing your search above and press return to search.
ముఖ్యమంత్రులూ..అందరినీ ముంచేసే పథకాలు వద్దు!
By: Tupaki Desk | 26 July 2019 1:30 AM GMTఆ దేశ కరెన్సీ బొలివర్.. అక్కడ ఎంత చిన్న ఉద్యోగం చేసుకునే వారికైనా కనీస వేతనం నెలకు 40 లక్షల బొలివర్లు. అంత జీతమా? అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రతి వస్తువు ధరా అదే స్థాయిలో ఉంటాయి. ఒక కండోమ్ కొనాలంటే 10 లక్షల బొలివర్లు ఇవ్వాలి. కాఫీ తాగాలంటే 20 లక్షల బొలివర్లు ఇవ్వాలి. కేజీ చికెన్ కొనాలంటే 60 లక్షల బొలివర్లు.. చివరకు టాయిలెట్ పేపర్ కూడా 25 లక్షల బొలివర్లు ఉంది. ఒకటేమిటి.. ప్రతి వస్తువు ధరా ఆకాశం కాదు కదా అంతకంటే ఇంకా ఎంతో ఎత్తున ఎగురుతున్నాయి. అందుకే అక్కడ ఏమీ కొనలేక - తినలేక - ఉండలేక గత అయిదేళ్లలో సుమారు 50 లక్షల మంది ప్రజలు ఆ దేశాన్ని వదిలి వెళ్లారు.. ఆ దేశం ఇంకేదో కాదు.. లాటిన్ అమెరికాలోని వెనెజువెలా. ఒకప్పుడు ఆయిల్ నిల్వలతో ధనధాన్యాలతో ప్రపంచంలోని ధనిక దేశాల సరసన నిలవడానికి తారాజువ్వలా పైకెగిసిన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా మారిపోయింది. అక్కడ ద్రవ్యోల్బణం లక్ష శాతానికి పైగా పెరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అక్కడ ధరలు ప్రతి రోజూ రెట్టింపై పోతున్నాయి. పదేళ్ల కిందట సంపన్న దేశంగా ఉన్న వెనెజువెలా ఎందుకిలా మారిపోయింది..? అందుకు కారణమేంటి.. ఆ దేశాన్ని నేర్చుకోవాల్సిందేమిటన్నది అతి ముఖ్యం. భారతదేశంలో పలు రాష్ట్రాలు వెనెజువెలాను చూసి జాగ్రత్తపడాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఎందుకిలా అయింది..
వెనెజువెలాను 2013 వరకు విక్టర్ హ్యూగో చావెజ్ పాలించారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం వెనెజువెలా. చమురు ధర ఎక్కువగా ఉన్న రోజుల్లో వెనెజువెలా ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉండేది. చమురు ఆదాయం పైనే ఆధారపడుతూ మిగతా రంగాలను నిర్లక్ష్యం చేశారు అక్కడ పాలకులు. ఆర్థిక వ్యవస్థ మొత్తం చమురు పైనే ఆధారపడేలా చేశారు. ఇతర ఉత్పత్తి రంగాలను పూర్తిగా మరిచారు.
ఈలోగా 2014లో అంతర్జాతీయంగా చమురు ధర పడిపోయింది. దీంతో ఒక్కసారిగా వెనెజువెలా ఆర్థిక పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా చమురు ధర క్షీణించడంతో వెనెజ్వేలాలో విదేశీ మారకం కొరత ప్రారంభమైంది. దాంతో ఆ దేశానికి వస్తువులను దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.
దేశానికి ఆదాయం సమకూర్చేందుకు వేరే మార్గాలేమీ ఏర్పరుచుకోకపోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఇదంతా ప్రాథమిక దశలో ఉన్న సమయంలో అధ్యక్షుడు చావెజ్ చనిపోవడంతో జోసెఫ్ మడూరో కొత్త అధ్యక్షుడయ్యారు. ఆయన పాలనలో పరిస్థితి మరింత దిగజారిపోయింది.
కొంప ముంచిన పథకాలు - అతి సంక్షేమం
వెనెజువెలా దుస్థితికి ఓ రకంగా మడూరో ప్రవేశపెట్టిన పథకాలే కారణం. ఉదాహరణకు... పేదలను ఆకర్షించేందుకు నిత్యావసరాల ధరలను ఆయన భారీగా తగ్గించారు. దాంతో గిట్టు బాటు ధర రాక రైతులు వాటిని పండించడం మానేశారు. ఫ్యాక్టరీలు కూడా ఉత్పత్తిని ఆపేశాయి. ఫలితంగా దాంతో ధరలు ఆకాశాన్నంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సరైన ఆర్థిక విధానాలు అనుసరించకుండా మడూరో మరిన్ని పొరపాట్లు చేశారు. మడూరో ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా అధిక కరెన్సీని ముద్రించేది.
పేదల్లో పేరు సంపాదించడానికి కనీస వేతనాలను తరచూ పెంచేది. దాంతో డబ్బు విలువ తగ్గుతూ వచ్చింది.
వెనెజ్వేలా ప్రభుత్వానికి అప్పు దొరకడం కూడా కష్టంగా మారింది. బ్యాంకులు వెనెజ్వేలాకు అప్పు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం మళ్లీ కరెన్సీని ముద్రించడం ప్రారంభించింది. దాంతో ఆ డబ్బు విలువ మరింత క్షీణించి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.
ఇది మొత్తం దేశాన్ని స్మశానంలా మార్చేసింది. లక్షలాదిమంది రోజుకు ఒక్క పూట కూడా తిండి తినలేకపోతున్నారు. అక్కడ విద్యా వ్యవస్థ పతనమైంది. రోగులకు మందులు దొరకడం కూడా కష్టంగా మారింది. పోషించే శక్తిలేక తల్లులు పసిపిల్లల్ని కూడా అమ్ముకుంటున్నారు.
అర్జెంటీనా కథ కూడా చూడండి..
ఇప్పుడు లాటిన్ అమెరికాకే చెందిన మరో దేశం అర్జెంటీనా కథ చూద్దాం. అర్జెంటీనా కూడా పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అప్పులు కూడా దొరక్క.. ఏకంగా ఏడాదికి 60 శాతం వడ్డీ ఇస్తాం అప్పులివ్వండి అని అడుగుతోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి - నగదు లభ్యతను పెంచడానికి ఈ చర్య తీసుకుంది. ప్రపంచంలో అత్యధిక వడ్డీ రేటు ఇదే. ఇంకే దేశంలోనూ ఇంత వడ్డీ రేటు లేదు. ఆ దేశ కరెన్సీ పెసో విలువ గత ఏడాది ఏకంగా 50 శాతం పడిపోయింది.
అర్జెంటీనాకు ఉన్న అప్పుల్లో 70 శాతం విదేశీ కరెన్సీలోనే ఉన్నాయి. దీంతో ఈ దేశం రుణాలను తిరిగి చెల్లిస్తుందా - లేదా అని పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అర్జెంటీనా చెల్లింపులు చేయాలంటే విదేశీ నిధులు కావాలి. డాలర్ తో పోల్చినపుడు పెసో విలువ 50 శాతం మేర పడిపోవడంతో ఈ దేశానికి డబ్బు దొరకడం కష్టమైపోయింది. మరోవైపు ఈ దేశపు బడ్జెట్ 6.5 శాతం లోటుతో ఉంది.
ఇదంతా ఎందుకంటే...?
వెనెజువెలా - అర్జెంటీనా వంటి దేశాలను చూసి భారత్ లోని రాష్ట్రాలు ఎందుకు గుణపాఠం నేర్చుకోవాలన్నది కీలక ప్రశ్న. దేశాల ఆర్థిక వ్యవస్థకు - రాష్ట్రాలు సంబంధం - పోలిక ఏమిటన్న ప్రశ్నా ఒకటుంది.
కానీ - మౌలికంగా చూసుకుంటే ప్రజాకర్షక పథకాలు - ఉచిత పథకాలు - ఖజానాకు చిల్లుపడేలా ఇబ్బడిముబ్బడిగా ప్రజలకు పథకాలు రూపంలో నగదు ఇవ్వడం వంటివన్నీ రాష్ట్రాల ఖజానాలను ఖాళీ చేసేవే. ఫలితం నిత్యం అప్పులు... ఎన్నికల రాజకీయాల్లో ఒకసారి పెట్టిన ఉచిత - నగదు పథకాలను మళ్లీ తీసివేసే అవకాశం ఏమాత్రం లేదు. అంతకుముందు కంటే ఇంకా ఎక్కువ ఇస్తేనే ఓట్లు పడతాయి.. సో... ఈ క్రమంలో అప్పులు పెరగి ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారే ప్రమాదం ఉంటుంది.
నెలానెలా పథకాల రూపంలో జీవితం సాఫీగా సాగిపోతుంటే పని చేసే అవసరం - లక్షణం తగ్గుతుంది. ఇది ఉత్సాదకతపై ప్రభావం చూపుతుంది. ఉత్పాదకత తగ్గితే ఉత్పత్తి రంగం దెబ్బతింటుంది. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థను కునారిల్లేలాచేస్తాయి.
రాష్ట్రాలు దేశంలో అంతర్భాగం కాబట్టి కేంద్రం ఏదో ఒక దశలో ఆదుకునే అవకాశం ఉంటుంది. కానీ.. ఒక రాష్ట్రాన్ని చూసి మరో రాష్ట్రం.. ఒక నాయకుడిని చూసి మరో నాయకుడు అనాలోచితంగా ఆర్థిక వ్యవస్థను ముంచేసే పథకాలు - విధానాలు ప్రవేశపెడుతుంటే అన్ని రాష్ట్రాల పరిస్థితీ అలాగే మారుతుంది. రాష్ట్రాలన్నీ ఆర్థికంగా దెబ్బతింటే దేశ ఆర్థిక పరిస్థితీ క్షీణిస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోని కొన్ని రాష్ట్రాలు తమ అనాలోచిత విధానాలు - అత్యాశా విధానాలు వల్ల తాము మునిగిపోవడమే కాకుండా ఏకంగా దేశాన్నే ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నాయనే చెప్పాలి. వెనెజువెలా వంటి సంపన్న దేశం పదేళ్లలో పూర్తిగా నాశనం కావడాన్ని చూస్తే జాగ్రత్త పడితే ఏ దేశానికైనా ఇలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదముందని అర్థమవుతుంది.
దక్షిణాదిలో మరీ ఎక్కువ...
ఏపీలో నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తామంటోంది ప్రభుత్వం. తెలంగాణలోనూ అదే తీరు. ఇక తమిళనాడులో చూస్తే అక్కడ ఫ్రిజ్ - వాషింగ్ మెషీన్ - టీవీ - గ్రైండర్ - మిక్సీ - సైకిల్ - టూవీలర్ - ఆవు - తాళి బొట్టు అన్నీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేవే. ఇంట్లోకి కావాల్సినవన్నీ ఉచితంగా సమకూరుతుంటే ఇక పనిచేయడం ఎందుకని ప్రశ్నించేవారు అక్కడ కనిపిస్తుంటారు.
ఇక దక్షిణాది రాష్ట్రాలకున్న అప్పులూ తక్కువేమీ కాదు. లక్షల కోట్ల అప్పులున్నాయి. కాబట్టి ఆర్థిక విధానాల్లో కాస్త ఆచితూచి అడుగేయకపోతే కష్టమేనని హెచ్చరిస్తున్నారు ఆర్థికవేత్తలు.