Begin typing your search above and press return to search.
ఎన్నికలు ముందు పవర్ స్టార్ దూకుడు పెంచాల్సిందే!
By: Tupaki Desk | 10 Feb 2022 5:44 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఒక సినిమా చేసి రిలీజ్ చేయడం కష్టంగా మారే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంతకంతకు స్పీడ్ పెంచారు. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమా స్ర్కిప్ట్ విని లాక్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగు ప్రాజెక్ట్ లు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే `భీమ్లా నాయక్` షూటింగ్ పూర్తి చేసారు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే క్రిష్ దర్శత్వంలో `హరి హర వీరమల్లు` అనే సోషియా ఫాంటసీ చిత్రాన్ని ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించారు. కొద్ది భాగం షూటింగ్ అనంతం విరామం తీసుకున్నారు. మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవదీయుడు భగత్ సింగ్` టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు పవన్ . ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. హరీష్ మార్క్ కమర్శియల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన `గబ్బర్ సింగ్` బ్లాక్ బస్టర్ అవ్వడంతో..ఆ కాంబోపై ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తికాగానే భగత్ సింగ్ రెగ్యులర్ షటింగ్ మొదలవుతుంది. అలాగే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శత్వంలో పవన్ కి ఓ కమిట్ ఉంది. దీంతో పాటు ఓ తమిళ సినిమా రీమేక్ లోనూ నటించబోతున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారయణ బ్యానర్లో కూడా ఓ సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది.
`ఖిలాడీ` సినిమా ప్రమోషన్ లో భాగంగా కోనేరు ఈ విషయాని రివీల్ చేసారు. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు జరగగా పవన్ సానుకూలంగా స్పందించినట్లు కోనేరు తెలిపారు. అయితే దర్శకుడు..స్ర్కిప్ట్ దొరకలేదు. కానీ ఇదే బ్యానర్లో రమేష్ వర్మ కి ఇంకా కమిట్ మెంట్లు ఉన్నాయి. వరుసగా ఆయన ఇదే బ్యానర్లో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఓ ప్యాకేజీ లెక్కలో ఆ బ్యానర్లో రమేష్ వర్మ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన పవన్ తో రమేష్ వర్మకు ఓ ఛాన్స్ దొరికే అవకాం ఉంది. అయితే `ఖిలాడీ` సక్సెస్ తో తానేంటే నిరూపిచుకోవాలి. కమర్శియల్ గా `ఖిలాడీ` పెద్ద సక్సెస్ అయితే పవన్ అవకాశం ఇవ్వడానికి వెనకడుగు వేయరు.
ఆయన స్పీడు ఎలాగూ కొనసాగుతుంది కాబట్టి పనిలో పనిగా రమేష్ వర్మ కి పవన్ తో పనిచేసే అరుదైన అవకాశం దక్కుతుంది. అయితే ఇక్కడ పవన్ కి చాలా తక్కువ సమయమే ఉంది. ఏపీ ప్రభుత్వం ముందొస్తు ఎన్నికలకు వెళ్తే గనుక సినిమాలు తాత్కలికంగా పక్కన పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా 2024లోనే ఎన్నికలు జరిగితే ఏడాదిన్నరలోనే సినిమాలన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది.