Begin typing your search above and press return to search.
తేల్చేసే టైమ్ : మహానాడు లో పవర్ ఫుల్ రాజకీయ తీర్మానం...?
By: Tupaki Desk | 16 May 2022 8:30 AM GMTమరి కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. అంగరంగ వైభవంగా ఈసారి మహానాడు నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. గట్టిగా చెప్పాలీ అంటే నాలుగేళ్ళ తరువాత తెలుగుదేశం నిర్వహిస్తున్న మహానాడు ఇది. 2018 తరువాత పార్టీ మహా సభ బాహాటాన గట్టిగా జరిగింది లేదు. ఇక మరో రెండేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈసారి మహానాడు దశ దిశను నిర్ణయించే విధంగా ఉంటుందని అంటున్నారు.
ఈ మహానాడు రాష్ట్ర రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పుతుందని కూడా భావిస్తున్నారు. ఈ మహానాడు వేదికగా చేసే రాజకీయ తీర్మానం మీదనే అందరి కళ్లూ ఉన్నాయి. దీన్ని పవర్ ఫుల్ గానే రూపొందిస్తున్నారు అని అంటున్నారు. జాతీయ రాజకీయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనుసరించబోయే విధానం ఏంటి అన్నది ఈ రాజకీయ తీర్మానం స్పష్టం చేస్తుంది.
అదే విధంగా గత కొద్ది నెలలుగా బాహాటంగా చర్చకు వస్తున్న పొత్తుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక విధానపరమైన నిర్ణయం అయితే ఇంతదాకా తీసుకోలేదు. త్యాగాలు చేయాలి తమ్ముళ్ళూ అని చంద్రబాబు చెబుతున్నారు. అలాగే పొత్తులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మరి ఆ పొత్తులు ఎవరితో ఉంటాయి. ఎలా ఉంటాయి. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తులు పెట్టుకుంటామని చెబుతున్న తమ్ముళ్లకు ఈ రాజకీయ తీర్మానం దిశా నిర్దేశం చేసే విధంగా ఉంటుంది అంటున్నారు.
ఇక ఏపీలో జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. అలాగే బీజేపీ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ తన ఆలోచనలు ఏంటి అన్నది గత ఏడాది జూమ్ మీటింగ్ ద్వారా జరిగిన మహానాడులో తేటతెల్లం చేసింది. బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తామని కూడా చెప్పుకుంది. మరి ఎన్నికలు మరింతగా దగ్గర పడుతున్న వేళ ఈసారి మహానాడు రాజకీయ తీర్మానంలో బీజేపీ మీద ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయని అన్నది కూడా చర్చగా ఉంది.
ఇక వామపక్షాలు, కాంగ్రెస్ వంటి పార్టీలను కూడగట్టుకుని మహా కూటమిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన తెలుగుదేశానికి ఉందని అంటున్నారు. అయితే బీజేపీ ఉన్న చోట అవి ఇమడలేవు. మరి బీజేపీతో టీడీపీ సంబంధాలు ఎలా ఉంటాయి. ఒక్క బీజేపీ కోసం మిగిలిన పార్టీలను వదులుకుంటారా. రేపటి రోజున ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న అంచనాలు ఏమైనా టీడీపీ ఉన్నాయా. అలా కనుక ఉంటే దాని ఆధారంగానే బీజేపీ తో చెలిమి చేయాలా లేక దాని నుంచి వేరుగా జరగాలా అన్నది కూడా ఆలోచించుకుంటారు అంటున్నారు.
ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం నిజం. పొత్తుల దిశగానే టీడీపీ అడుగులు వేస్తోంది. దాంతో పొత్తులకు అనుకూలంగానే టీడీపీ రాజకీయ తీర్మానం ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఏపీలో వైసీపీ కి బలమైన ఆల్టర్నేషన్ రాజకీయం ఎలా రూపకల్పన చేయాలన్నది కూడా టీడీపీ మహానాడు ద్వారా ఒక కచ్చితమైన క్లారిటీని ఇస్తుందని అంటున్నారు.