Begin typing your search above and press return to search.

పాతికేళ్లుగా వాన‌నీటిని తాగి బ్ర‌తికేస్తున్నారు

By:  Tupaki Desk   |   9 July 2016 10:30 PM GMT
పాతికేళ్లుగా వాన‌నీటిని తాగి బ్ర‌తికేస్తున్నారు
X
ఓ సామాన్యులు గొప్ప సందేశం ఇచ్చే ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఇది. బెంగ‌ళూరు స‌మీపంలోని ఓ కుటుంబం వాన నీటిని మాత్ర‌మే తాగుతూ త‌మ జీవితం గ‌డిపేస్తోంది. అదికూడా ఒక‌టి రెండేళ్లుగా కాదు... పాతికేళ్లుగా వాళ్లకు నీళ్లంటే వాన‌నీరే. ఆ ఇంటి య‌జ‌మానితో ప్రారంభ‌మైన ఈ అల‌వాటు కుటుంబ స‌భ్యులంద‌రిలోనూ పెన‌వేసుకుపోయింది.

బెంగ‌ళూరు స‌మీపంలోని దొడ్డ‌బ‌ల్లాపూర్ గ్రామంలో నివ‌సించే చేనేత కార్మికుడైన ప్ర‌భాక‌ర్ కుటుంబానిదీ ఆస‌క్తిక‌ర‌మైన జీవ‌న‌గాథ‌. వ‌ర్షాకాలంలో ప‌డిన వాన‌నీటిని త‌న ఇంటి చుట్టూ ఉన్న ట్యాంకుల‌లో ప్ర‌భాక‌ర్‌ తో పాటు ఆయ‌న కుటుంబం నింపేస్తుంది. అనంతరం వాటిని నిత్యావ‌స‌రాల కోసం ఉప‌యోగించుకుంటుంది. అంటే స్నానాలు - బ‌ట్ట‌లు శుభ్రం చేసుకోవ‌డానికి వ‌గైరా అనుకునేరు. ఆ రెంటికి మాత్ర‌మే కాదు. ఎంచ‌క్కా తాగ‌టానికి - వంటకు సైతం ఇదే నీటిని వాడుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఇలా వాన నీటిని తాగేందుకు వీళ్లు అల‌వాటుప‌డిపోయారు. పాతికేళ్లుగా ఉన్న ఈ అల‌వాటుకు 2010లో ఓ రెండు వారాల పాటు మాత్ర‌మే బ్రేక్ ప‌డింద‌ట‌. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఓ రెండు వారాల పాటు వాన‌నీటిని తాగ‌కుండా వాళ్లు ఉండిపోయారంటున్నారు. క్రేజీ క‌దు. ఇలా అంద‌రూ వాడినా వాడ‌క‌పోయినా నీటిని పొదుపు చేసుకునే అల‌వాటు చేసుకుంటే బాగుండేది. ఏమంటారు?