Begin typing your search above and press return to search.
ప్రభాస్ ‘ఆదిపురుష్’ బీజేపీ సినిమానే.. కౌంటర్ ఇచ్చిన ‘బండి’
By: Tupaki Desk | 17 Sep 2022 2:30 AM GMTతెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఈరోజు బీజేపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఆదిపురుష్ ను కూడా టార్గెట్ చేశారు. ఆదిపురుష్ అనేది హిందుత్వ ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు బీజేపీ చేపట్టిన ప్రచార చిత్రం అని ఆయన ఆరోపించారు. ప్రభాస్ కుటుంబానికి, కృష్ణంరాజుకు బీజేపీ అమిత ప్రాధాన్యం ఇస్తుండడంతో కేటీఆర్ ఇలా ఆరోపణలు గుప్పించారు.
మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా ప్రభాస్, ఆదిపురుష్‌లపై కామెంట్ చేయడంతో దీన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఆదిపురుష్ సినిమాతో బీజేపీ ప్రమేయం ఉందన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
ఇతిహాసమైన రామాయణం ఆధారంగా రూపొందిన గొప్ప చిత్రం ఆదిపురుష్ అని... ఇది రాముడి చుట్టూ తిరుగుతుందని.. కెటిఆర్‌కి మన సంస్కృతిపై ఇలాంటి సినిమాలు చేయకపోతే ఇంకేం చేయాలని నిలదీశారు. ఆయన తన తండ్రి కేసీఆర్‌పై సినిమాలు చేయాలనుకుంటున్నారా? అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు..
యాదృచ్ఛికంగా కష్ట సమయాల్లో బీజేపీ కూడా ప్రభాస్‌కు అండగా నిలుస్తోంది. కృష్ణంరాజు మృతి పట్ల బీజేపీ పెద్దలు సంతాపం తెలుపుతున్నారు. స్వయంగా వచ్చి కలుస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు హైదరాబాద్ వచ్చి ప్రభాస్ ఫ్యామిలీని పరామర్శించారు. అమిత్ షా కూడా ప్రభాస్ కుటుంబాన్ని కలవనున్నారు.
మరోవైపు కృష్ణంరాజు గతంలో బీజేపీలో కేంద్రమంత్రిగా చేయడంతో ఆయనను బీజేపీ ఓన్ చేసుకుంటోంది. కేసీఆర్ మాత్రం ఇప్పటివరకూ ప్రభాస్ కుటుంబాన్ని పరామర్శించలేదు. కేటీఆర్, తలసాని లాంటి వారు వచ్చి పరామర్శించారు. ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను కేటీఆర్ టార్గెట్ చేయడాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. ప్రభాస్ పై ఈగ వాలనీయకుండా కాపు కాస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.