Begin typing your search above and press return to search.
యాంకర్ ప్రదీప్ క్షమాపణలు
By: Tupaki Desk | 21 Jun 2021 2:30 PM GMTప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఏపీ రాజధాని విషయంలో చేసిన కామెంట్లు వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఈ యాంకర్ వివాదాల్లో ఇరుక్కున్నారు. ఈ కామెంట్స్ తో ఏపీలోని కొందరి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై ఏపీ పరిరక్షణ సమితి మండిపడింది. వెంటనే యాంకర్ ప్రదీప్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు యాంకర్ ప్రదీప్ స్పందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. తాను అన్న మాటలకు క్షమాపణలు చెప్పారు.
ఓ టీవీ షోలో యాంకర్ ప్రదీప్ ఏపీ రాజధాని ఏది అంటూ ప్రశ్న అడగటం.. దానికి వైజాగ్ అని సమాధానం చెప్పడంతో వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ న్యాయవివాదాల్లో ఉండటంతో మరో వైపు రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్ లోని అతడి ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్ ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు.
యాంకర్ ప్రదీప్ దీనిపై వివరణ ఇచ్చారు. 'తాజాగా జరిగిన ఓ షోలో రాష్ట్రం, దాని రాజధాని ఏంటి అనే ప్రశ్న అడుగుతున్న పద్ధతి తప్పుదోవ పట్టింది. అందరికీ వేరే విధంగా అర్థమైంది. వాళ్లకది బాధ కలిగించింది. దీని ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.. ఎవరినైనా బాధపెట్టినా మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు.. ఎవరినో కించపరచాలనో.. హేళన చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. అలాంటి పని నేను ఎప్పుడూ చేయను.. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుతున్నా' అని వెల్లడించారు.
ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలనేదే తన ఉద్దేశమంటూ వీడియో విడుదల చేశాడు.