Begin typing your search above and press return to search.

సీబీఐ డైరెక్టర్ బాస్...జేడీ మాత్రం కుక్కట..

By:  Tupaki Desk   |   21 Feb 2017 10:51 AM GMT
సీబీఐ డైరెక్టర్ బాస్...జేడీ మాత్రం కుక్కట..
X
ఎమ్మార్ కుంభకోణంలో కేసుల నుంచి తన తండ్రిని, సోదరుడిని తప్పించడానికి తెగ ప్రయత్నాలు చేసిన కోనేర్ ప్రదీప్ సీబీఐ అధికారులు వెరైటీగా నిక్ నేమ్స్ పెట్టాడట. సీబీఐ అధికారులు జరిపిన సోదాల్లో దొరికిన సీడీలు, పత్రాల ఆధారంగా ఈ సంగతి తెలుసుకుని అధికారులే షాకయ్యారు. ఇంతకీ ప్రదీప్ పెట్టిన పేర్లేంటో తెలుసా..? సీబీఐ డైరెక్టరు బాస్ అని.. జేడీకి డాగ్ అని పేరు పెట్టాడట.

ఎమ్మారు కుంభకోణంలో నిందితుడు కోనేరు ప్రసాద్ ను ఎలాగైనా బయటపడేయడానికి ఆయన కుమారుడు కోనేరు ప్రదీప్ చాలా ప్రయత్నాలే చేశాడట. మొయిన్ ఖురేషితో కలిసి అనేక వ్యవహారాలు నడిపాడు. యూరప్‌ లో సీబీఐ ఉన్నతాధికారితో భేటీకి కూడా ప్రయత్నించాడు. ఇందుకోసం ఖురేషికి ప్రదీప్‌ పెద్ద ఎత్తున డబ్బు చెల్లించినట్టు తెలిసింది. బీబీఎం చిట్‌ చాట్ ఆధారంగా ప్రదీప్‌ పై సీబీఐ కేసు నమోదు చేసింది. అనంతరం ప్రదీప్ నివాసాల్లో సోదాలు జరిపింది సీబీఐ. ఈ సందర్భంగా దొరికిన ఆధారాల్లో ఇలాంటి నిక్ నేమ్స్ ప్రస్తావన కూడా ఉండడడంతో వారంతా షాక్ అయ్యారు.

హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో కోనేరు ప్రసాద్ నివాసంలో సిబిఐ అధికారులు సోమవారం సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ - చెన్నైలోని ఆయన కార్యాలయాలలో చేపట్టిన సోదాల్లో భాగంగా హైదరాబాద్‌ లో కూడా సిబిఐ సోదాలు చేపట్టింది. సిబిఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా - ఖురేషితో గల సంబంధాలపై ఆరా తీసేందుకు ప్రసాద్ ఇంట్లో సోదాలు జరిపారు. రంజిత్ సిన్హా సిబిఐ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ బెయిల్ కోసం ఖురేషి అనే మాంసం వ్యాపారి ద్వారా ప్రదీప్ ఆయన్ను కలిశారని ఆరోపణలు ఉన్నాయి. రంజిత్ సిన్హా వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ప్రదీప్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/