Begin typing your search above and press return to search.
మంత్రిగారి 'చెప్పుల ప్రతిజ్ఞ' ఇదో వెరైటీ గురూ!
By: Tupaki Desk | 27 Dec 2022 3:50 AM GMTరాజకీయ నేతలు పంతాలు పట్టడం.. ప్రతిజ్ఞలు చేయడం.. ప్రత్యర్థులకు సవాళ్లు రువ్వడం.. సంచలన కామెంట్లు చేయడం అనేది రాజకీయాల్లో కామనే. అయితే.. చాలా మంది వీటిని అప్పుడో.. మరిసటి రోజో.. మరిచిపోతారు. ప్రత్యర్థులు పట్టించుకోలేదు కదా.. అందుకే..తాము చేసిన సవాళ్లు.. ప్రతిజ్ఞలకు తాము కూడా ఒబే కాలేమని చెప్పేస్తారు. అయితే.. అందరూ ఒకేలా ఉంటారా? రాజకీయ నేతల్లోనూ వెరైటీ నాయకులు.. మాటపై నిలబడే నాయకులు కూడా ఉంటారు.
ఇలాంటివారిలో అందరికన్నా ముందున్నట్టుగా ఉన్నారు.. మధ్యప్రదేశ్‌కు చెందిన కీలకనాయకుడు.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ప్రద్యుమన్ సింగ్ తోమర్. ఈయన చాలా వెరైటీ. ఏదైనా చెప్పారంటే.. చేస్తారంతే! అనే టైపు. ఈ ఏడాది అక్టోబరులో ఈయన చెప్పుల ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే.. మధ్యప్రదేశ్‌లోని పారిశ్రామిక రాజధాని గ్వాలియర్ నగరంలో అధ్వానంగా మారిన రోడ్లు బాగుచేయాలని ఆయన అనేక సార్లు తన ప్రభుత్వాన్నే డిమాండ్ చేశారు. కానీ, పట్టించుకోలేదు.
దీంతో నిరసన వ్యక్తంచేస్తూ.. ప్రద్యుమన్ సింగ్ ఈ ఏడాది అక్టోబర్ 30న ఆయన ప్రజల సమక్షంలో సంచలన ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ రోడ్లు బాగు చేసేవరకు నేను చెప్పులు వేసుకోను! అని ఒట్టు పెట్టారు. అంతే.. అప్పటి నుంచి చెప్పులు వేసుకోకుండానే తిరుగుతున్నారు. రోడ్ల మరమ్మతులు చేస్తేనే తాను చెప్పులు వేసుకుంటానని ఎవరడిగినా చెప్పేవారు. ఇలానే తిరిగారు. ఇక, తాజాగా.. ఇక్కడ రోడ్లు బాగయ్యాయి.
దీంతో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తన చేతులతో ప్రద్యుమన్ సింగ్ తోమర్కు చెప్పులు తొడిగారు. అనంతరం సింగ్.. సింధియా పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. మొత్తానికి అంతరించిపోతున్న మేటి నాయకులు.. అని చర్చించుకుంటున్న రోజుల్లో తోమర్ వంటివారు అప్పుడప్పుడు.. అక్కడక్కడా తగులుతూనే ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.