Begin typing your search above and press return to search.
కొడుక్కి బుద్ది చెప్పిన మాజీ మంత్రి ..ఏమైందంటే ?
By: Tupaki Desk | 2 May 2020 4:30 PM GMTకరోనా కష్టకాలంలో తమ ప్రాణాలని పనంగా పెట్టి ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై అనుచితంగా ప్రవర్తించిన కొడుకుకి మాజీ మంత్రి ఒకరు తగిన గుణపాఠం చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు విషయమేంటంటే ...కరోనా పోరులో ప్రాణాలని పనంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులపై అక్కడక్కడా కొంతమంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వారి విధులకు అడ్డుతగలడమే కాకుండా ..వారిపై రెచ్చిపోతున్నారు.
ఈ క్రమంలోనే గురువారం బైక్ పై రోడ్డుపైకి వచ్చిన యువకుడిని పోలీసులు ఆపారు. ముఖానికి మాస్క్ లేకుండా ఎందుకు వచ్చాయని ప్రశ్నించగా సదరు యువకుడు పోలీసులపై జులుం ప్రదర్శించారు. ‘మా నాన్న ఎవరో తెలుసా’ అంటూ పోలీసులను బెదిరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అనుచరుడైన మాజీ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ స్పందించారు. ఈ వీడియోకి ఆయనకి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా ..పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది ఆయన సుపుత్రుడే.
తన కొడుకు రిపుదమాన్ చేసిన పనికి తోమర్ విచారం వ్యక్తం చేయడమే కాకుండా అదే రోజు సాయంత్రం అతడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి పోలీసులకు క్షమాపణ చెప్పించి, అలాగే లాక్ డౌన్ నిబంధనలు పాటించనందుకు జరిమానా చెల్లించారు. అక్కడితో ఆగకుండా తర్వాతి రోజు కొడుకుకి సరైన గుణపాఠం చెప్పారు. మున్సిపల్ కార్మికులతో కలిసి శుక్రవారం చెత్త ఎత్తించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు శిక్షగా పారిశుద్ధ్య పని చేయించారు. కొడుకు చేసిన తప్పును సరిదిద్ది హుందాగా ప్రవర్తించిన ప్రద్యుమన్ సింగ్ తోమర్ ను ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు.