Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే భారత్ లోనే ఎక్కువ.. అదీ మోడీ హయాంలోనే.. కాంగ్రెస్ ఎంపీ సంచలనం
By: Tupaki Desk | 9 Aug 2022 5:19 AM GMTతిరుగులేని సర్కారుగా పేరు తెచ్చుకున్న మోడీ సర్కారుకు సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలు ఇటీవల కాలంలో బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి భారీ విమర్శతో పాటు.. ఆరోపణను సంధించారు అసోంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్.
దీనికి సంబంధించిన వివరాలతో కూడిన ఒక లేఖను ఆయన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు రాశారు. శాంతిభద్రతల సవాళ్లకు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయటం సమర్థనీయం కాదని.. ఇది హక్కుల ఉల్లంఘనే అంటూ విరుచుకుపడ్డారు.
ఇంటర్నెట్ సస్పెన్షన్ ల నియంత్రణకు కేంద్రం ఏదైనా చట్టం రూపొందిస్తుందా? అంటూ కొత్త సందేహాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఆర్థిక లావాదేవీలు సర్వసాధారణమైన ఇప్పటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ షట్ డౌన్ ఏ మాత్రం సరికాదన్నారు.
ప్రస్తుతం మణిపూర్ లో ఐదు రోజులుగా ఇంటర్నెట్ బంద్ సాగుతోందన్న ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ పౌర హక్కుల పరిరక్షణకు పని చేసే యాక్సెస్ నౌ సంస్త నిర్వహించిన అధ్యయనం ప్రకారం గడిచిన ఏడాదిలో వరుసగా నాలుగో ఏడాదీ అత్యధిక ఇంటర్నెట్ షట్ డౌన్ లు చోటు చేసుకున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో నిలిచినట్లుగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 2014లో ఇంటర్నెట్ సేవల్ని ఆరుసార్లు నిలిపివేస్తే.. 2018 తర్వాత మాత్రం ప్రతి ఏడాది వందకు పైగా సందర్భాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించి విస్మయానికి గురి చేశారు.
2021లో ప్రపంచ వ్యాప్తంగా 182 ఇంటర్నెట్ షట్ డౌన్ లు చోటు చేసుకుంటే భారత్ లోనే అత్యధికమని.. అది కూడా 106 ఉదంతాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అంటే.. దాదాపు 55 శాతానికి పైగా ఇంటర్నెట్ షట్ డౌన్ ఉదంతాలు భారత్ లో ఉన్న వైనాన్ని ఆయన వెల్లడించారు.