Begin typing your search above and press return to search.

ఈయన్ని ఎవరికైనా చూపిస్తే బాగుంటుందేమో ?

By:  Tupaki Desk   |   14 May 2022 9:20 AM GMT
ఈయన్ని ఎవరికైనా చూపిస్తే బాగుంటుందేమో ?
X
అదేదో సినిమాలో 'వీడిని ఎవరికైనా చూపించండిరా అలా వదిలేయకండి' అనే డైలాగు చాలా పాపులర్. ఇపుడు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మత ప్రచారకుడు కేఏ పాల్ పరిస్థితి కూడా అలాగే అయిపోయిందేమో అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మండువేసవిలో పెద్ద జల్లు కురిస్తే ఎలాగుంటుందో రాజకీయ వేడి పెరిగిపోతున్న సమయంలో కేఏపాల్ కామెంట్లు కూడా అలాగే ఉంటుంది.

కాకపోతే ఒక్కోసారి అవి శృతి మంచి మరీ ఎక్కువైపోతున్న సమయంలోనే పై అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆయన మాటలు ఏమిటంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ 178 సీట్లు గెలుస్తుందని కామెడీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క హైదరాబాద్ మినహా మిగిలిన 41 సీట్లు తమ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరి ఆ హైదరాబాద్ సీటు మాత్రం ఎందుకు వదిలేశారో చెబితే బాగుంటుంది.

లోక్ సభ సీట్ల గెలుపు విషయాన్ని చెబుతున్నపుడు పాల్ మానసిక స్థితి ఎలాగుందో ఏమో. మొన్నటి ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ నుండి పాల్ పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఒకటి రెండు రోజులు పాల్ ప్రచారం కూడా చేసి తర్వాత వదిలేశారు. చివరకు ఏమైందో ఏమో పాల్ స్వయంగా వైసీపీ అభ్యర్థికి ఓట్లేయమనే ప్లకార్డు పట్టుకుని కనిపించారు. అంటే తానేం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారని మాత్రం అర్ధమవుతోంది.

ఇదే సమయంలో అమిత్ షా ను కలిసినపుడు 2 శాతం ఓట్లు కూడా లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంట బీజేపీ ఎందుకు పడుతోందని అడిగారట. దానికి అమిత్ షా బదులిస్తూ తాము పవన్ వెంట పడలేదని, పవనే తమ వెంట పడుతున్నారని బదులిచ్చినట్లు పాల్ చెప్పారు.

ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదుకానీ పాల్ చెప్పిన మాటలు మాత్రం నవ్వుకోవటానికి సరదాగా ఉంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే పాల్ మానసికస్ధితిపైనే అనుమానంగా ఉంది. లేకపోతే ఎంపీగా నామినేషన్ వేసిన పాల్ చివరకు వైసీపీకి ఓట్లేయమని అడగడం ఏమిటి ? రాబోయే ఎన్నికల్లో తెలుగురాష్ట్రాల్లోని 41 సీట్లూ గెలుస్తామని, దేశవ్యాప్తంగా 178 సీట్లు వస్తాయని చెప్పటమేంటో అర్ధం కావటంలేదు.