Begin typing your search above and press return to search.
ఆ పోలీస్ పై వేటు తప్పలేదు
By: Tupaki Desk | 21 July 2022 2:30 AM GMTతన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని సెలవు పెట్టి.. వైఎస్సార్సీపీ నేతలతో కలిసి విదేశాలకు వెళ్లిన ప్రకాశం జిల్లా దర్శి ఎస్సై చంద్రశేఖర్ పై జిల్లా ఎస్పీ సస్పెండ్ వేటు వేశారు. జూలై 13న ఆయన ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా థాయ్ లాండ్ టూరుకు వెళ్లారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అనుమతి తీసుకోకుండా ఎస్సై బ్యాంకాక్ వెళ్లడంపై ఎస్పీ మలికా గార్గ్ సీరియస్ అయ్యారు. ఎస్సై బ్యాంకాక్ వ్యవహారంపై విచారణ జరిపి ఆయనను వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ నేతలతో కలిసి చంద్రశేఖర్, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బ్యాంకాక్ వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటుపడింది.
ఈ నేపథ్యంలో ఎస్సై చంద్రశేఖర్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్నిమార్లు విదేశాలకు వెళ్లారు?ఉన్నతాధికారుల అనుమతులు పొందారా? అనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. పాస్‌పోర్టు ఆధారంగా ఎస్సై పర్యటనల వివరాలను తెప్పించారు. ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో చంద్రశేఖర్ వ్యవహార శైలి ఎలా ఉందో కూడా విచారణ చేస్తున్నారు. అదేవిధంగా బ్యాంకాక్ నుంచి తన స్నేహితులతో ఉన్నతాధికారుల గురించి మాట్లాడిన వీడియోపైనా దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఎస్సై చంద్రశేఖర్ తనపై ఎస్పీ వేటు వేయడంతో వైఎస్సార్సీపీ నేతలతో తనకు ఉన్న విస్తృత పరిచయాలతో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అదేక్రమంలో తన స్నేహితులతో కూడా తనపై ఎటువంటి యాక్షన్ ఉండదని చెప్పారని అంటున్నారు. ఇప్పటికే కొంతమంది వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి ఎస్సైపై వేటుపడకుండా చూడాలని ఉన్నతాధికారులకు సిఫార్సులు చేశారని ప్రచారం జరుగుతోంది.
అయితే పోలీసు ఉన్నతాధికారులు వారి ఒత్తిళ్లకు తలొగ్గలేదని అంటున్నారు. ఇలాంటి దారితప్పిన విషయాల్లో ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గితే పోలీస్ శాఖ జనంలో పలుచన అవుతుందని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. పైగా ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ చేయించడంతోపాటు, ఇంకా అనేకసార్లు ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు ఉన్న అభియోగాలపైనా విచారణ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ కట్టు తప్పితే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.
కాగా ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, దర్శి నగర పంచాయతీ కౌన్సిలర్, కొంతమంది సర్పంచులు, రేషన్ డీలర్లు తదితర 20 మందితో కలిసి దర్శి ఎస్ఐ చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ రవిశంకర్ బ్యాంకాక్ పర్యటన చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.