Begin typing your search above and press return to search.

నాలుగు వ్యాక్సిన్లలో టీకా ప్రోగ్రాం షురూ కానుందా?

By:  Tupaki Desk   |   3 Jan 2021 7:30 AM GMT
నాలుగు వ్యాక్సిన్లలో టీకా ప్రోగ్రాం షురూ కానుందా?
X
ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు వీలుగా టీకాలు వచ్చేయటం తెలిసిందే. రష్యా.. యూకే.. అమెరికా.. యూరప్ తో ఈ వివరాల్నిపాటు పలు గల్ఫ్ దేశాలతో పాటు మరిన్ని చోట్ల ఇప్పటికే టీకాల వినియోగం మొదలైంది. అయితే.. ఈ దేశాల్లో ఎక్కడా లేనట్లుగా ఒకేసారి నాలుగు రకాల టీకాలతో వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో జరగనుంది. దీనికి సంబంధించిన ప్లానింగ్ చేస్తున్నారు.

ప్రపంచంలో మరే దేశంలోనూ సిద్ధం కాని విధంగా నాలుగు రకాల వ్యాక్సిన్లతో సిద్ధమైన ఏకైక దేశం భారత్ అని కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ పేర్కొన్నారు. ఫైజర్ ఆస్ట్రజెనెకా టీకాలకు యూకే ఓకే చెబితే.. ఫైజర్ కు అమెరికా అనుమతి ఇచ్చిందన్నారు. అయితే.. భారత్ మాత్రం అత్యవసర వినియోగానికి నాలుగు టీకాలకు అత్యవసర అనుమతిని ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం దేశంలో ఆరు టీకాలకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ సాగుతున్నాయి. వీటిల్లో ఆస్ట్రాజెనుకా-ఆక్స్ ఫర్డ్ వర్సిటీ సంయుక్తంగా డెవలప్ చేస్తున్న కొవిషీల్డ్ ఒకటి. దీన్ని భారత్ లో సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి రూపొందిస్తున్నారు. మరోవైపు భారత్ బయోటెక్ కోవాగ్జిన్.. ఇంకోవైపు క్యాడిలాకు సంబంధించిన టీకాను క్లినికల్ ట్రయల్స్ సాగుతున్నాయి.

టీకా తొలి విడతలో మూడు కోట్ల మందికి ఉచితంగా టీకాలు వేయనున్నట్లుగా కేంద్రమంత్రి హర్షవర్దన్ చెబుతున్నారు. వీరిలో 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లుకాగా.. మరో కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు కూడా టీకాలు ఇవ్వనున్నారు. ప్రాధాన్యత క్రమంలో యాభై ఏళ్లకు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న 27 కోట్ల మందికి జులై లోపు వ్యాక్సిన్ ఇస్తామని చెబుతున్నారు. అయితే.. అందరికి ఉచితం ఉండదని..కొందరి నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.