Begin typing your search above and press return to search.
హ్యాండ్ ఇస్తూనే.. వియ్ లవ్ ఆంధ్రా అన్నాడు
By: Tupaki Desk | 5 April 2018 4:15 AM GMTఅభిమానం ఉంటే ఎలా ఉంటుంది? నిజంగా ప్రేమ ఉంటే.. తాము ప్రేమించే వారి విషయంలో ఎలా వ్యవహరిస్తాం? అన్న దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తన మాటలతో ఆంధ్రోళ్లకు మంట పుట్టేలా చేశారు. ఇప్పటికే మోడీ సర్కారు తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆంధ్రోళ్లకు జవదేకర్ మాటలతో మరింత మండేలా చేశారు.
వియ్ లవ్ ఆంధ్రా అన్న ఆయన.. ఆంధ్రా ప్రాంతమన్నా.. అక్కడి ప్రజలన్నా తమకెంతో అభిమానమని.. ఆ రాష్ట్రం కోసం తాము అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లినా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సబ్ కా సాత్. సబ్ కా వికాశ్ అనే విధానాన్ని తాము అనుసరిస్తున్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదర్చటంలో తన పాత్ర ఉందని.. ఇప్పుడు రెండు పార్టీలు విడిపోవటం బాధ కలిగించే విషయంగా ఆయన ఒప్పుకున్నారు.
ఏపీ మీద ప్రేమ ఉందన్న మాట సరిపోదు. నిజంగా అంత ప్రేమే ఉంటే.. ఆంధ్రా ప్రాంతానికి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలే తప్పించి.. ఉత్త మాటలతో సరిపెట్టటం సరికాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మాటలు చెబితే విని నమ్మే రోజులు పోయాయన్న విషయాన్ని జవదేకర్ గుర్తిస్తే మంచిది. తియ్య తియ్యటి మాటలు చెప్పే మోడీ మాటల్ని పూర్తిగా నమ్మినందుకు తామెంత మునిగిపోయామన్న భావనతో ఉన్న ఆంధ్రోళ్లకు జవదేకర్ లాంటోళ్ల మాటలు మరింతగా మండించటం ఖాయం.