Begin typing your search above and press return to search.
మోడీతో కేసీఆర్ పోటీపడుతున్నాడంటున్న ఎర్రన్న
By: Tupaki Desk | 19 Feb 2017 5:49 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ పడుతున్నారు! అవునా? ఇటీవలి కాలంలో మోడీని ప్రసన్నం చేసుకుకోవడానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నట్లుంటే పోటీ ఎలా అనే సందేహం రావచ్చు. అది నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే...సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్ మాత్రం పై మాట చెప్తున్నారు. అయితే ఈ పోటీ అభివృద్ధిలో కాదట. సమాజంలోని పేదలను మరింత పేదలుగా మార్చడంలో ప్రధానితో తెలంగాణ సీఎం పోటీ పడ్తున్నారట. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఖమ్మంకు వచ్చిన ప్రకాశ్ కారత్ ఈ సందర్భంగా పీఎం - సీఎంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సబ్ ప్లాన్ నిధులను 80శాతం మేర పక్కదారి పట్టిస్తూ పేదలను దారిద్య్రంలోకి నెట్టివేయడంలో కేసీఆర్ మోడీతో పోటీ పడుతున్నారన్నారు.
దేశంలో ఆకలి కేకల్లోంచి పుట్టుకొచ్చిన ఉద్యమాలన్నింటిలో తెలంగాణలో జరుగుతున్న మహాజన పాదయాత్ర గొప్పదని ప్రకాశ్ కారత్ అన్నారు. ఇది చరిత్రకెక్కిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తు చేస్తోందని, దేశంలో అణగారిన వర్గాలకు అవసరమైన సమర నినాధాన్ని ఈ పాదయాత్ర ద్వారా సందేశం పంపిందన్నారు. మార్చి 19వ తేదీలోపు ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని, లేనిపక్షంలో మహాజన పాదయాత్ర మరో మహోద్యమంగా మారుతుందని ప్రకాశ్ కారత్ హెచ్చరించారు. దేశంలో పరిపాలన సాగిస్తున్న బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ రహస్య విధానాలను గుట్టుచప్పుడు కాకుండా అమలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల కారణంగానే దేశంలో పేదలు ఆర్థిక అసమానతల మధ్య కొట్టుమిట్టాడుతున్నారన్నారు. దేశంలో సంపద కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని, వ్యాపారులు, పెట్టుబడిదారుల కనుసన్నల్లోనే బీజేపీ నేతలు పాలన సాగిస్తున్నారని తెలిపారు. అణగారిన వర్గాలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించపోవడం, వారి సంక్షేమానికి ప్రత్యేకంగా కార్యాచరణ అమలు చేయకపోవడం వల్లే వారి సమగ్రాభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇందుకే దేశవ్యాప్తంగా సామాజికన్యాయం, సమగ్రాభివృద్ధి డిమాండ్ ఉద్యమ రూపం దాల్చుతోందని కారత్ అన్నారు.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సబ్‌ప్లాన్‌కు చోటులేకుండా పోయిందని కారత్ ఆరోపించారు. దళిత గిరిజనుల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి అమలు చేయాల్సిన సబ్‌ప్లాన్ చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్ చట్టాలను నీరుగార్చేందుకు ప్లానింగ్ కమిషన్ రద్దు చేసిందన్నారు. తెలంగాణాలో నిరుపేదల సంక్షేమం కోసం బడ్జెట్‌లో వాటాలు దక్కించుకునేందుకు పేదల తరపున సాగుతున్న పోరుయాత్ర పాదయాత్ర అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేక రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/