Begin typing your search above and press return to search.
ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు కేటీఆర్ ఆన్సర్
By: Tupaki Desk | 30 Jan 2016 10:04 AM GMT పరీక్ష హాల్లో జవాబు దొరకని ప్రశ్నలొస్తే ఎంత కష్టంగా ఉంటుందో రాజకీయాల్లోనూ అంతే... మన దగ్గర సమాధానం లేని ప్రశ్నలు - ఇబ్బందికరమైన అంశాలపై ఎవరైనా ప్రశ్నిస్తే అలాగే ఉంటుంది. ఎంతటి నేతలకైనా ఒక్కోసారి అది చికాకుపుట్టిస్తుంది. ఆ సమయాల్లోనే వారు గతి తప్పుతారు... మాట తూలుతారు... వివాదాలకు కారణమవుతారు. కానీ, తెలంగాణ యువనేత - మంత్రి కేటీఆర్ మాత్రం ఎంతో రాజకీయ పరిణితి ఉన్నవాడిలా అలాంటి ఓ కఠిన ప్రశ్నను ఎదుర్కొని తెలివైన సమాధానంతో పరీక్ష పాసైపోయారు. ఇంతకీ ఈ ప్రశ్న, జవాబుల గోలేంటని క్వశ్చన్ మార్కు మొఖం పెట్టొద్దు.. అసలు విషయానికి వచ్చేద్దాం.
గ్రేటర్ ఎన్నికల సమయంలో, గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ పార్టీని ముందుండి నడిపిస్తున్న సేనానిగా కేటీఆర్ కు అనుకోని ప్రశ్న ఎదురైంది. అది కూడా ఏదో సాధారణ విలేకరులతో, ప్రజలో అడిగిన ప్రశ్న కాదు.. ఒక సెలబ్రిటీ.. ప్రజలందరికీ తెలిసిన ప్రముఖుడు.. టీవీ ఛానల్ లో ఎదురెదురుగా కూర్చుని అడిగేసరికి ఎవరికైనా ఇబ్బందే. కానీ, తాజాగా ఒక చర్చాకార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ కేటీఆర్ ను హైదరాబాద్ లో నీటి ఎద్దడిపై సూటిగా ప్రశ్నించారు. అత్యంత క్లిష్టమైన సమస్య కావడంతో కేటీఆర్ ఎలాంటి సమాధానం ఇస్తారా అని అంతా ఆసక్తిగా చూశారు. ''హైదరాబాద్ లోని కోటిమందికి పైగా ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కొంటారు'' అంటూ ప్రకాశ్ రాజ్ కేటీఆర్ ను నేరుగా ప్రశ్నించారు. కేటీఆర్ వద్ద దానికి సరైన సమాధానం లేకపోయినా కూడా ఆయన సహనం కోల్పోకుండా సమాధానమిచ్చారు. తాగునీటి సమస్యను పరిష్కరించే విషయంలో తమ సర్కారు చాలా సీరియస్ గా ఉందని.. తెలంగాణకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. ఈ ఏప్రిల్ చివరి నాటికి తెలంగాణలోని పది నియోజకవర్గాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో రెండు మంచినీటి రిజర్వాయర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని.. ప్రతిఒక్కరికి మంచినీరు అందిస్తామని చెప్పారు. అయితే... ప్రకాశ్ రాజ్ హైదరాబాద్ గురించి అడిగితే కేటీఆర్ తెలివిగా మిషన్ భగీరథ అంటూ మొత్తం తెలంగాణకు అప్లయి చేసి తండ్రి కేసీఆర్ లాగే మాయచేసి ఆన్సర్ చెప్పేసి అక్కడి నుంచి బయటపడ్డారు. మొత్తానికి కేటీఆర్ ఎక్కడా తొట్రుపడకుండా, సహనం కోల్పోకుండా సమాధానం చెప్పేశారు.