Begin typing your search above and press return to search.
ఇలాంటివాటితో మన సెంటిమెంట్లు దెబ్బతినవా?: ప్రకాశ్ రాజ్ ఫైర్
By: Tupaki Desk | 1 Sep 2022 1:25 PM GMTబహు భాషా నటుడు, విలక్షణ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రకాశ్ రాజ్ ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనుసరించే విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటారనేది తెలిసిన విషయమే. #జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన సోషల్ మీడియాలో పలు అంశాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. తాను హిందుత్వానికి వ్యతిరేకం కాదని.. కేవలం ప్రధాని మోదీ, అమిత్ షాలకు మాత్రమే వ్యతిరేకమని ఆయన పలుమార్లు నొక్కి వక్కాణించారు.
కాగా #జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ఆయన చేసే ట్వీట్లు అందరిలో ఆలోచన రేకెత్తిస్తుంటాయి. బీజేపీ సానుభూతిపరులు, కార్యకర్తలు అయితే ఆయనపై బూతుల దాడికి దిగుతుంటారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది.
ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్యానం చేసుకుంటూండగా, వినాయకులు ఆయనకు ఇరువైపులా నిల్చున్నట్లు, వినాయకుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) యూనిఫాం ధరించినట్లు, కేజీఎఫ్, పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ను గుర్తు చేస్తూ వినాయకుడి విగ్రహాలను రూపొందించడాన్నితన ట్వీటులో ప్రకాష్ రాజ్ గట్టిగా ప్రశ్నించారు. ఇలాంటివాటి వల్ల మనోభావాలు దెబ్బతినవా? అని నిలదీశారు.
ప్రకాశ్ రాజ్ సందర్భం వచ్చిన ప్రతిసారీ కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తూనే వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కావాల్సింది ప్రతి ఇంటిపైనా జెండా ఎగురవేయడం కాదన్నారు. నిత్యావసరాల ధరలను తగ్గించడం, ఉద్యోగాలను కల్పించడం ద్వారా దేశ భక్తిని ప్రోత్సహించాలని కోరారు. చేనేత పరిశ్రమలోని కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే జాతీయ జెండాలను పాలిస్టర్‌తో తయారు చేయడానికి అనుమతించడంపై సెటైర్లు వేశారు. పాలు, పెరుగును కూడా వదలకుండా జీఎస్‌టీని విధిస్తున్నారని మండిపడ్డారు.
ఇలా బీజేపీ ప్రభుత్వాల విధానాలపై గళమెత్తే ప్రకాశ్ రాజ్ దేశంలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలే వ్యవస్థలను చక్కదిద్దాలన్నారు. వ్యవస్థను బీజేపీ నేతలు తీవ్రంగా దెబ్బతీశారని తీవ్ర విమర్శలు చేశారు.