Begin typing your search above and press return to search.
మన దేశాధినేత నుంచి స్ఫూర్తి పొందా.. మోడీపై ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యాస్త్రాలు
By: Tupaki Desk | 18 May 2022 12:30 PM GMTబహుభాషా నటుడు.. యాక్టర్ కమ్ పొలిటికల్ నాయకుడిగా మారిన ప్రకాశ్ రాజ్.. గురించి అందరికీ తెలిసిం దే. కర్ణాటకకు చెందిన ఈయన.. తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ విధానాలు.. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తరచుగా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
గత ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఒంటరిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక, రెండు నెలల కిందట ఏపీ సినిమా రంగానికి సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలోనూ పోటీ చేసి.. వార్తల్లో నిలిచారు.
ఇక, దేశంలో రాజకీయాలు.. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యవహార శైలిపై ప్రకాశ్ రాజ్ తరచుగా విమర్శలు సంధిస్తుంటారు. రచయితలు.. కళాకారులపై దాడులు జరిగినప్పుడు.. కర్ణాటకలో ఒక రచయిత్రిని దుండగులు కాల్చి చంపినప్పుడు.. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్లు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
రాజకీయాల్లో ఉన్నానని అంటూ.. ఆయన తరచుగా మోడీపై విమర్శలు చేస్తుంటారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోందని.. ఆయన నిర్భయంగా తన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల సుప్రీం కోర్టు దేశద్రోహం చట్టంలోని సెక్షన్ 124 ఏ రద్దు చేసినప్పుడు.. కూడా ప్రకాశ్ రాజ్ ఆసక్తిగా స్పందించారు. పాలకులకు ఇది చెంపపెట్టు.. ఇప్పటికైనా.. నేలపైకి దిగివస్తారని ఆశిద్దాం.. అందరూ మనుషులేనని భావిస్తారని అనుకుందాం.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా మరో ట్వీట్ చేశారు. ``మన సుప్రీం లీడర్(దేశాధినేత) నుంచి స్ఫూర్తి పొందా.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ప్రయత్నించండి!`` అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్లో ప్రకాశ్ రాజ్.. హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ వస్త్రాలంకరణలో కనిపించారు. తలపై హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టోపీని ధరించారు. దీనిని తాను దేశాధినేత(మోడీ) నుంచి స్ఫూర్తి పొందానని పేర్కొన్నారు.
అంటే.. తరచుగా ప్రధాని మోడీ దస్తులు మారుస్తుంటారు.. అదేవిధంగా ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంతంలో వాడే దుస్తులు ధరిస్తారు. అంటే.. ఒకరకంగా..ఏ ఎండకు ఆ గొడుగు లెక్క!! ఇదే విషయా న్ని పరోక్షంగా విమర్శిస్తూ.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ ద్వారా తన మనసులోని భావాన్ని వ్యక్తీకరించారన్న మాట.