Begin typing your search above and press return to search.
తమిళ రాజకీయాలు..రియల్ వ్యాపారం ఒక్కటే
By: Tupaki Desk | 7 July 2018 2:08 PM GMTగత కొద్దికాలంగా తనకే పార్టీతో సంబంధం లేదని ప్రకటిస్తూనే బీజేపీపై సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే. పలు అంశాల్లో ఆ పార్టీకి మింగుడుపడని కామెంట్లను ప్రకాష్ రాజ్ చేశారు. దీంతో ఆయనపై కమలనాథులు కన్నెర్రచేశారు. దాదాపుగా రెండేళ్లుగా వార్తల్లో నిలుస్తున్న తమిళ రాజకీయాలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజకీయాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మారాయని ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన తూత్తుకుడి మృతుల సంతాప సభలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన జరగడం..కాల్పుల ఘటనలో 33 మందిని మృత్యువాత పడటం తెలిసిన సంగతే. మృతుల సంతాప సభకు హాజరైన కమల్ హాసన్ తాజాగా స్పందిస్తూ అన్నాడీఎంకే భవిష్యత్తులో తిరిగి ప్రభుత్వంలో ఉండదనే వాస్తవమేనని అన్నారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ పరిస్థితి ప్రమాదకరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ``నేను రాజకీయాల్లోనే ఉన్నాను కానీ.. ఎన్నికల్లో నిలబడే రాజకీయ నాయకుడిలా కాదు. తమిళనాట అన్ని రాజకీయ పార్టీలు ఒకేలా ఉన్నాయి. ఇదో రియల్ ఎస్టేట్ వ్యాపారం వలే అయింది. భవిష్యత్తులో వాటన్నింటికీ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఉద్యమం రానుంది.` అని ప్రకాష్ రాజ్ జోస్యం చెప్పారు. తమిళ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.