Begin typing your search above and press return to search.
హిట్లర్ అధిపత్యమే కూలింది.. మోడీ ఎంత?
By: Tupaki Desk | 24 March 2018 9:06 AM GMTబహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన ప్రకటనలు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆయన.. తాజాగా తన మార్క్ ప్రకటన చేసి వార్తల్లోకి వచ్చేశారు. తనకెంతో సన్నిహితురాలైన జర్నలిస్ట్ హత్యకు గురైన నాటి నుంచి ప్రకాశ్ రాజ్ లో మార్పు వచ్చిందని చెబుతారు.
సమాజం గురించి పోరాడుతున్న వారి గురించి.. సామాజిక అంశాలపై గళం విప్పుతున్న వారిని అణగదొక్కేస్తున్న శక్తులపై వాయిస్ పెంచిన ప్రకాశ్ రాజ్.. దేశంలో పెరిగిపోతున్న వివిధ ఛాందవాదాలపై తీవ్ర ఆగ్రహాన్ని.. అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ కన్నడ జిల్లా మంజేశ్వరలో శాంతిసేనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. అంతా నాదేనన్నట్లుగా సాగు అధిపత్య ధోరణి కొంతకాలమే సాగుతుందని.. హిట్లర్ లాంటి వాడి అధిపత్యమే కూలిపోయిందన్న ఆయన.. దాంతో పోలిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత? అని ప్రశ్నించారు.
తాము పవర్ లోకి వచ్చినంతనే గంగానదిని స్వచ్ఛంగా మారుస్తామన్న మోడీ హామీని బీజేపీ సర్కారు ఎంతమేర పూర్తి చేసిందన్న ప్రశ్నను సంధించారు. గంగానది స్వచ్ఛతను కొంతమేర చేసిన మోడీ సర్కారు ఆ తర్వాత చేతులు దులిపేసుకుందన్నారు. మతతత్వ్తాన్ని పెంచుతున్న మోడీ సర్కారు ప్రజల్ని భయపెడుతోందన్నారు. మోడీ సర్కారును హిట్లర్ తో పోలిక తీసుకురావటం ఇప్పుడు సంచలనంగా మారింది.