Begin typing your search above and press return to search.
కేంద్ర మంత్రిని కోతితో పోల్చిన ప్రకాశ్ రాజ్
By: Tupaki Desk | 22 Jan 2018 2:19 PM GMTమోదీ ప్రభుత్వం - అందులోని వ్యక్తులపై విరుచుకుపడడంలో చురుకుదనం చూపిస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా మరో కేంద్రమంత్రి పైనా విమర్శలు చేశారు. తన వాక్చాతుర్యం చూపిస్తూ పరోక్షంగా కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ ను కోతితో పోల్చారు.
కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ ఇటీవల డార్విన్ మానవ పరిణామ సిద్ధాంత తప్పని... ఆ సిద్ధాంతాన్ని విద్యాలయాల్లో బోధించరాని అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ కేంద్రమంత్రిపై విమర్శలు చేశారు. "మనిషి కోతి నుంచి పుట్టాడనే విషయాన్ని మన ప్రాచీనులు చూడలేదని మంత్రిగారు చెబుతున్నారు. కానీ, ఆయ్యా...అందుకు భిన్నమైన పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తున్నామనే విషయాన్ని అంగీకరించకుండా ఉండగలరా? మనిషి కోతిలాగా మారి గతాన్ని తవ్వుతూ మళ్లీ రాతి యుగంకాలం నాటికి తీసుకుని వెళ్తున్నాడు" అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
కాగా కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలపై కొందరు శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే స్పందించారు. డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామక్రమ సిద్ధాంతం నిరూపితమైందని - పరిణామక్రమానికి సంబందించిన ప్రాథమిక వాస్తవాలపై ఏ విధమైన వివాదం లేదని - ఇది శాస్త్రీయమైన సిద్ధాంతమని శాస్ర్తవేత్తలు ప్రకటన కూడా విడుదల చేశారు.