Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాష్ రాజ్ నిప్పులు

By:  Tupaki Desk   |   27 Feb 2022 1:30 PM GMT
ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాష్ రాజ్ నిప్పులు
X
సినిమా పరిశ్రమ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు గళమెత్తుతున్నారు. నిన్న మెగా బ్రదర్ నాగబాబు సంచలన ట్వీట్లతో విరుచుకుపడగా.. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఏపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

పవన్ కళ్యాణ్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే 'భీమ్లానాయక్' రిలీజ్ ను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోని విడుదల చేయలేదంటూ ఇటీవల పలువురు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'చిత్ర పరిశ్రమను ఇబ్బందులకు గురిచేస్తూ ప్రోత్సహిస్తున్నామంటే ఎలా నమ్మాలి?' అని ప్రశ్నించారు. దయచేసి ఇంతటితో ఓ ముగింపు పలకండి అని కోరారు.

'సృజన , సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం.. ఆధిపత్య ధోరణి ఏమిటీ? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా?' ఏమైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి? కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకు? ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరు' అని ప్రకాష్ రాజ్ నిప్పులు చెరిగారు.

వరుసగా సినీ ప్రముఖులు బయటకు వచ్చి ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఇక దీనికి మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని లాంటి వాళ్లు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. మరి ఈ ఫైట్ ఎటువైపు సాగుతుందో చూడాలి.