Begin typing your search above and press return to search.

ప్రకాష్‌ రాజ్‌ లాంటివాడు ఒకడుండాలి: అరవింద్‌ కేజ్రీవాల్‌

By:  Tupaki Desk   |   11 Jan 2019 4:15 AM GMT
ప్రకాష్‌ రాజ్‌ లాంటివాడు ఒకడుండాలి: అరవింద్‌ కేజ్రీవాల్‌
X
జస్ట్ ఆస్కింగ్‌ అంటూ మోదీ ప్రభుత్వాన్ని ట్విట్టర్‌ సాక్షిగా ఏకిపారేసిన ప్రకాష్‌ రాజ్‌.. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌ నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకటించడమే కాదు… అందుకు తగ్గ గ్రౌండ్‌ వర్క్‌ ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. దాదాపు వీరి భేటి గంటసేపు జరిగింది. ఈ సందర్భంగా పలు రాజకీయ - సామాజిక అంశాలపై చర్చించినట్లు ప్రకాశ్‌ రాజ్‌ ట్విట్టర్‌ లో చెప్పారు. అలాగే.. ప్రకాశ్‌ రాజ్‌ ని కూడా కేజ్రీవాల్‌ ఆకాశానికి ఎత్తేశారు. ప్రకాష్‌ లాంటి వాడు రాజకీయాల్లో చాలా అవసరం అని.. ఆయన పొలిటికల్‌ ఎంట్రీని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు.. బెంగళూరు సెంట్రల్‌ లో చదువుకున్నవాళ్లు ఎక్కువు. వాళ్లంతా కేజ్రీవాల్‌ లాంటి డైనమిక్‌ లీడర్‌ కు ఎట్రాక్ట్‌ అవుతారు. అన్నింటికి మించి బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గంలో ఉత్తరాది వారి ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే ప్రకాశ్‌ రాజ్ కేజ్రీవాల్‌ ని కలిశారని వార్తలు విన్పిస్తున్నాయి. మరోవైపు.. మోదీ వ్యతిరేఖ శక్తుల్ని ఏకం చేసేందుకు ప్రకాష్‌ రాజ్ ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగంగానే కేజ్రీవాల్‌ తో తన ప్రయాణం మొదలుపెట్టారని సమాచారం. ఏదిఏమైనా.. రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని అనుకుంటున్నాడు విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌.