Begin typing your search above and press return to search.
మరోసారి బీజేపీ నేతల పై ట్విట్టర్ లో రెచ్చిపోయిన విలక్షణ నటుడు !
By: Tupaki Desk | 5 Feb 2020 5:09 AM GMTసినిమా రంగంలో అన్ని పాత్రలలో తనదైన నటనతో మెప్పించి నేషనల్ అవార్డ్ ని సైతం అందుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తన నటనతో తెలుగు , తమిళం తో పాటుగా అన్ని రకాల భాషలలో నటించి , అన్ని వర్గాల ప్రజలని ఆకట్టుకున్నారు. ఇక సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే ..ప్రకాష్ రాజ్ కి బీజేపీ అన్న , బీజేపీ నేతలు అన్నా కూడా అసలు పడదు. ఈ విషయం అందరికి తెలిసిందే. వీలుచిక్కినప్పుడల్లా బీజేపీ పై విమర్శలు , ఆరోపణలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతల పై ఘాటైన విమర్శలు చేస్తుంటారు.
తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ తన నోటికి పనిచెప్పారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సమయంలో ఆప్ , బీజేపీ మధ్య మాటలు హీటెక్కించాయి. ఒకానొక సమయంలో ఈ మాటలు కోటలు దాటాయి. అప్ నేతల పై బీజేపీ నేతల విమర్శలు హద్దులు దాటి ఈసీ నిషేధం వరకు వెళ్లిన విషయం కూడా తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీజేపీ విమర్శలపై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా ఘాటైన విమర్శలకు దిగాడు. "గోలీ, బిర్యానీ, టెర్రరిస్టులు, హేట్ స్పీచ్" అంటూ ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ నేతలకి ఎన్నికల ప్రచారంలో మాట్లాడేందుకు ఇంతకంటే మంచి మాటలు కానీ, అంశాలు కానీ లేవా అని ప్రశ్నించాడు. బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆ మాటలను గుర్తు చేస్తూ...ఆలా బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వారికి సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. ప్రకాశ్ రాజ్ విమర్శలు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క సామాజిక సమస్య పై ప్రకాష్ రాజ్ తన స్పందన తెలియజేస్తున్నారు.