Begin typing your search above and press return to search.
బెంగళూరు సెంట్రల్ నుంచే పోటీ చేస్తా: ప్రకాశ్ రాజ్
By: Tupaki Desk | 6 Jan 2019 4:08 AM GMTప్రముఖ దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగుతానని, కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. తన ఈ కొత్త ప్రయాణానికి మద్దతుగా నిలుస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని, అన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలియజేస్తానని పేర్కొన్నారు.
కాగా, ‘సిటిజన్ వాయిస్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక దృక్పథాన్ని చాటుతున్న ప్రకాశ్ రాజ్, ‘జస్ట్ ఆస్కింగ్’ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఓ పౌరుడిగా ఆయన తరచుగా ప్రశ్నలు సంధిస్తున్న విషయం తెలిసిందే. క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. కానీ, ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు.
కాగా ప్రకాశ్ రాజ్ ఎంచుకున్న బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ నేత పీసీ మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009 నుంచి ఇక్కడ లోక్ సభ ఎన్నికలు జరగ్గా పీసీ మోహన్ గెలిచారు. 2014లోనూ విజయం ఆయన్నే వరించింది. కాంగ్రెస్ ఇక్కడ రెండో స్థానంలో ఉంటుండగా... జేడీఎస్ ఏమాత్రం ప్రభావవంతంగా లేదు. అయితే.. గత రెండు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్లు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. అర్బన్ నియోజకవర్గం కావడంతో పోటీదారులు ఎక్కువగా ఉంటున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటోంది. ఇలాంటి నియోజకవర్గం ప్రకాశ్ రాజ్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.