Begin typing your search above and press return to search.
విమర్శిస్తే.. యాంటీ మోడీని అయిపోతానా?
By: Tupaki Desk | 5 Oct 2017 9:43 AM GMTప్రముఖ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను దారుణంగా హత్య ఉదంతంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించటం.. ఈ ఇష్యూలో ప్రధాని తీరును ఆయన తప్పు పట్టటం తెలిసిందే. ఇప్పటివరకూ మరే నటుడు రియాక్ట్ కాని రీతిలో ప్రధాని మోడీని తప్పు పట్టిన ప్రకాశ్ రాజ్ పై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
పొగడటమే తప్పించి మోడీని తప్పు పట్టే సెలబ్రిటీలు లేని వేళ.. అందుకు భిన్నంగా ప్రకాశ్ రాజ్ మాటలు కమలనాథులకు కంట్లో నలకలుగా మారాయి. ప్రకాశ్ రాజ్ విమర్శలపై లక్నోకు చెందిన ఒక లాయర్ అయితే.. ఏకంగా కేసు పెట్టేశారు కూడా. ఇలా ప్రకాశ్ రాజ్ ఆగ్రహం దేశవ్యాప్తంగా కలకలం రేపగా.. తాజాగా తనపై కేసు పెట్టిన వైనంపై స్పందించారు.
తాను నిజమే మాట్లాడతాననని.. అబద్ధం చెప్పటం తనకు అలవాటులేదన్నారు. గౌరీ లంకేశ్ హత్య విషయంలో మోడీ తీరును తాను తప్ప పట్టానని.. ఇప్పటికీ తాను అన్న మాటల మీద నిలబడతానని స్పష్టం చేశారు. ప్రధాని మోడీని ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ లక్నో లాయరు వ్యవహారంపై స్పందించిన ఆయన.. తనకు మోడీ మీద గౌరవం ఉందని కానీ కొన్ని విషయాల్లో ఆయన తీరుతో తాను ఏకీభవించటం లేదన్నారు. తనను నోటికి వచ్చినట్లు తిడుతున్న వారంతా తన ఎదురుగా వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేదన్నారు.
ఇప్పటికి తాను అన్న మాటలపైన తాన నిలబడతానని.. వెనక్కి తగ్గేది లేదన్నారు. తాను మోడీని విమర్శించినంత మాత్రానా తాను యాంటీ మోడీ అయినట్లు కాదని స్పష్టం చేశారు. హత్యకు గురైన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ తో చక్కటి సంబంధాలున్నాయి. ఆమె హత్యపై దేశం యావత్తు చర్చ జరగ్గా.. ప్రధాని మోడీ మాత్రం ఈ అంశంపై స్పందించకపోవటాన్ని ప్రకాశ్ రాజ్ తప్పు పట్టారు.