Begin typing your search above and press return to search.
సారీ చెబితే సరిపోదు సార్.. మోడీపై ప్రకాష్ రాజ్ సెటైర్
By: Tupaki Desk | 21 Nov 2021 10:35 AM GMTబీజేపీ అధినేత, ప్రధాని నరేంద్రమోడీ అంటేనే మొన్నటివరకు ప్రకాష్ రాజ్ ఒంటికాలిపై లేచేవాడు.. మోడీ విధానాలను, ఆయన తీరును బహిరంగంగా విమర్శించిన వాళ్లలో దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒకరు. అలాంటి ప్రకాష్ రాజ్ ఆ మధ్య బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీచేశారు. అయితే ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలోనే ఓడిపోయారు.. అయినా కూడా బీజేపీ వ్యతిరేక విధానాలను ప్రకాష్ రాజ్ కొనసాగిస్తూనే ఉన్నాడు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకుంటున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ప్రధాని ఈ ప్రకటన చేయగానే రైతులు హర్షం వ్యక్తం చేయగా.. ప్రతిపక్షాలు మాత్రం దుమ్మెత్తిపోశాయి. రైతులు దేశవ్యాప్తంగా ఏడాదిగా ఉద్యమం చేస్తున్నారని..ఈ నేపథ్యంలోనే తాను రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు క్షమాపణలు చెప్పారు.
ఇకనైనా రైతులు.. ధర్నాలు ఆపేయాయాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. దేశ ప్రధాని ప్రకటనపై ప్రముఖులు కూడా స్పందించారు. ఇది రైతులు సాధించిన విజయం అంటూ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు.
‘ప్రియమైన ప్రధాని నరేంద్రమోడీ సార్..రైతులకు చెప్పిన క్షమాపణలు సరిపోవు.. రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తారా?’ అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. అంతేకాదు.. కేటీఆర్ ట్వీట్ ను ట్యాగ్ చేశారు ప్రకాష్ రాజ్.