Begin typing your search above and press return to search.
ఇది దేశ పౌరుల మన్ కి బాత్ : ప్రకాష్ రాజ్
By: Tupaki Desk | 11 Dec 2018 11:10 AM GMTతెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకు పోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. అయితే ఇతర మూడు రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొసాగుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ సత్తా చాటలేక పోయింది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలకు ప్రజలు చెరమగీతం పాడారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించి అందరి దృష్టిని ఆకర్షించారు.
గత కొంత కాలంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్న ప్రకాష్ రాజ్ ఇటీవలే టీఆర్ ఎస్ పార్టీ అధినేతను కలిసి గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. తాజాగా ఆయన బీజేపీ ఓటమికి హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది దేశ ప్రజల మన్ కీ బాత్ - ఈ ఎన్నికలతో ప్రజలు బీజేపీకి బైబై చెప్పేస్తున్నారు. బీజేపీ ఓటమికి గల కారణం ఏంటో తెలుసా.. లేదంటే ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు అంటూ ట్వీట్ చేశాడు.
రాజస్థాన్ - మద్యప్రదేశ్ - చత్తీశ్ ఘడ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వాలు ఉన్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ రాష్ట్రాలు కాంగ్రెస్ వశం అవుతాయని ట్రెండ్ ద్వారా తెలుస్తోంది. ఇది బీజేపీకి పెద్ద దెబ్బ అనేది అందరి అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా ప్రభావం చూపుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం.