Begin typing your search above and press return to search.
తన మద్దతు టీఆర్ఎస్‌కే..ప్రకాశ్‌రాజ్ సంచలన ప్రకటన
By: Tupaki Desk | 25 Nov 2018 5:20 AM GMTప్రకాశ్ రాజ్. విలక్షణ నటుడు. వివిధ అంశాలపై స్పందించే ప్రకాశ్‌రాజ్ ఆయన సూటిగా మాట్లాడే తీరుతో బీజేపీ బద్ద వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారు. రచయిత్రి - జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య సందర్భంగా, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో బాహాటంగానే కాంగ్రెస్‌కు మద్దతివ్వడం ద్వారా ప్రకాశ్ రాజ్ ఈ గుర్తింపును పొందారు! అలా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే ప్రకాశ్ రాజ్ తాజాగా తెలంగాణ ఎన్నికల్లో తన వైఖరి ఏంటో ప్రకటించేశారు. తన మద్దతు టీఆర్ఎస్ పార్టీకి అని ప్రకటించారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన పలు అంశాలపై విపులంగా స్పందించారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రకాశ్ రాజ్ తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారని ప్రశ్రించగా, టీఆర్ఎస్ పార్టీకే నా మద్దతు అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. కర్ణాటకలో ఒక నిర్ణయం తెలంగాణలో మరో నిర్ణయం ఎందుకని ప్రశ్నించగా...`కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ఒక నాయకుడు ఉన్నారు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు``అని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్రం కోసం విశేష కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ``స్టేట్స్ మ్యాన్`` అని ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ప్రశంసించారు. దీనికి కారణాలు చెప్తూ, హోమం చేసి వచ్చిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ``కులాలు,మతాలు చూసి ఓటు వేయకండి`` అని కోరారని వివరించారు. హోమం చేయడం కేసీఆర్ వ్యక్తిగతమని, ఓట్లు అడగడం ఒక పార్టీ నేతగా ఆయన పాత్ర అని పేర్కొంటూ ఇలాంటి విశిష్ట లక్షణాలు నాయకులకు ఉండాలన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ నిర్వహిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను ప్రకాశ్ రాజ్ అభినందించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ప్రకాశ్ రాజ్ టార్గెట్ చేశారు. చంద్రబాబుకు తెలంగాణ రాజకీయాలతో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. ``చంద్రబాబు మంచి నాయకుడు. అయితే, ఆయనకు తెలంగాణ ఎన్నికలతో ఏం పని? ఒకవేళ ఆయన ఎన్నికల్లో గెలిస్తే..13 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా? తర్వాతి కాలంలో ఆయన పాలనపై దృష్టి పెట్టాల్సి వస్తే...ఏపీకి ప్రాధాన్యత ఇస్తారా లేక తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తారా? తెలంగాణ ప్రజల సమస్యలను ఆయన పరిష్కారా? అలాంటప్పుడు తెలంగాణ ఎన్నికలలతో ఆయనకు ఏం పని?`` అంటూ ప్రకాశ్ రాజ్ సూటిగా నిలదీశారు.