Begin typing your search above and press return to search.
కేంద్రమంత్రి పై ప్రకాశ్ రాజ్ ఫైర్
By: Tupaki Desk | 8 Dec 2017 5:24 PM GMTజర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాత నుంచి విలక్షణ నటుడు ప్రకాశ్ తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకాలం తన పనేదో తాను అన్నట్లుగా వ్యవహరించే ప్రకాశ్ రాజ్ ఈ మధ్యకాలంలో మారిపోయారు. మతతత్వ్త రాజకీయాలపై తీవ్రస్థాయిలో దునుమాడుతున్న ఆయన.. తాను ఎవరిని విమర్శిస్తున్నాను.. తన వ్యాఖ్యల తీవ్రత ఏమిటి? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న విషయాన్ని అస్సలు పట్టించుకోవటం లేదు.
తాజాగా బీజేసీ నేత.. కేంద్రమంత్రి అనంతకుమార్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హిందుత్వం.. జాతీయత ఒక్కేటనంటూ ఆయన చేసి వ్యాఖ్యల్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యల్ని తప్పు పడుతూ ట్విట్టర్ లో ట్వీట్లు చేశారు.
జాతీయత.. హిందుత్వం ఒక్కటేనని చెబుతున్న మంత్రిగారు.. తన మాటలకు అర్థాన్ని వివరిస్తే బాగుంటుందన్నారు. ఇస్లాం మతాన్ని ప్రపంచంలోనే లేకుండా చేయాలని ఈయనగారు అనుకుంటున్నారేమో అంటూ గతంలో అనంతకుమార్ చేసిన వీడియోను పోస్ట్ చేశారు.
జాతీయత.. హిందుత్వం ఒక్కటేనని అనంతకుమార్ అంటున్నప్పుడు అసలు మతం గురించిన విషయాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఏమిటి? అంటూ క్వశ్చన్ వేశారు. తన మాదిరి మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన ఆయన.. తాము ఈ దేశం పౌరులం కాదా? అని ప్రశ్నించారు.
అసలు మీ ఎజెండా ఏమిటి? పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్‌కు ప్రతీకలా? లౌకిక దేశం మనందరిదని.. సిగ్గులేని రాజకీయాలతో మీకు ఒరిగేదేమిటంటూ ప్రకాశ్ రాజ్ కడిగేశారు. గతంలో ప్రధాని మోడీపై కూడా చురకలేసిన ప్రకాశ్ రాజ్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.