Begin typing your search above and press return to search.

మోడీ 2019 నుంచి నిరుద్యోగి!

By:  Tupaki Desk   |   28 April 2018 5:34 PM GMT
మోడీ 2019 నుంచి నిరుద్యోగి!
X
సినిమాల నుంచి వ‌చ్చి రాజకీయాల‌ను దీటుగా చేయ‌గ‌లిగిన వారి సంఖ్య కాస్త త‌క్కువే. అలాంటి వారిలో ఒక‌రు ప్ర‌కాష్ రాజ్‌. మ‌నిషి ఏ రంగంలో స్థిర‌ప‌డాల‌న్నా మైండ్‌లో క్లారిటీ - స్థిర చిత్తం ముఖ్యం. అలాంటివి ప్ర‌కాష్ రాజ్ లో పుష్క‌లంగా ఉండ‌టం వ‌ల్ల‌ సినిమాల్లో బాగా రాణించ‌గ‌లిగారు ప్ర‌కాష్ రాజ్‌. ఏ పాత్ర వేసినా దానిని చ‌క్క‌గా అర్థం చేసుకుని అందులో ఇమిడిపోవ‌డం ఆయ‌న వంతు. అయితే, చిత్రంగా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యాణం కూడా అంతే పక్కాగా సాగుతోంది. వేసే అడుగులో క్లారిటీ ఉన్న సినీ రాజ‌కీయ ప్ర‌ముఖుడు ప్ర‌కాష్ రాజ్‌. పూర్తి స్థాయిలో సినిమాల్లో న‌టిస్తూనే రాజ‌కీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారాయ‌న‌.

ప‌క్కా లౌకిక వాదిగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌కాష్ కొంత కాలంగా మోడీ అనుచిత విధానాల ప‌ట్ల ఘాటుగానే స్పందిస్తూ వ‌చ్చారు. ఇష్యూ బేస్డ్‌గా మోడీని విమ‌ర్శ‌ల‌తో క‌డిగి పారేస్తున్న ప్ర‌కాష్ రాజ్ మాట‌ల‌తో కోటలు క‌ట్టే మోడీకి ఈరోజు భారీ కౌంట‌ర్ వేశారు. తాజాగా మోడీ *తాను క‌న్న‌డిగ‌నే* అంటూ చేసిన ట్వీట్‌ ను చాలా తెలివిగా తిప్పికొట్టిన ప్ర‌కాష్ రాజ్ మోడీకి మ‌రోమాట రాకుండా చేశారు.

అవును... ఇపుడు మీరు క‌న్న‌డిగ‌, గుజరాత్‌లో గుజ‌రాతీ. మీరు అప‌ద్ధాల కోరు అని చెప్ప‌డానికే మీ ట్వీట్లే సాక్ష్యం. మీకు మ‌తి భ్ర‌మించింది అని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు వస్తే క‌ర్ణాట‌క గుర్తొచ్చింది. లేక‌పోతే ఏ దేశంలోనో కాఫీ తాగుతూ తిరుగుతూండేవారు అని అన్నారు. మోడీ ఒక్క మాటే అన్నాడు కానీ అందులోంచి ప్ర‌కాష్ రాజ్ విమ‌ర్శ‌లు, సాక్ష్యాలు రెండూ సంపాదించారు. అస‌లే మాట కారి అయిన ప్ర‌కాష్ మోడీని మాట‌ల మూట‌ల‌తో కొట్టారు.

బీజేపీ.. దేశంలో సిద్ధాంతాలు లేని ఏకైక పార్టీగా వ్యాఖ్యానించిన ప్ర‌కాష్ రాజ్‌... కాంగ్రెస్‌ - సీపీఐ - సీపీఎం ఇలా అన్ని పార్టీల‌కు సిద్ధాంతాలున్నాయ‌ని, కానీ ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీకి మాత్రం ఏ సిద్ధాంతాలు లేవ‌ని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల‌నే త‌న సిద్ధాంతాలుగా భావించి బీజేపీ దేశాన్ని వెన‌క్కు న‌డిపిస్తోంద‌ని అన్నారు. మీరు క‌న్న‌డిగ అన్నారుగా... మీకు క‌న్న‌డ నేర్పిస్తాం కానీ స్కూల్లో కాదు, వృద్ధాశ్ర‌మంలో. ఎందుకంటే 60 దాటిన మీరు 2019 త‌ర్వాత నిరుద్యోగి. ఆ వ‌య‌సులో మీకు వృద్ధాశ్ర‌మ‌మే క‌దా స‌రైన ప్ర‌దేశం అంటూ ఎత్తిపొడిచారు. ప్ర‌శాంతంగా ఉండండి... ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు, వ‌చ్చే ఏడాది మిమ్మ‌ల్ని ఇంటికి పంప‌డానికి జ‌నం ఆల్రెడీ ఫిక్స‌యి ఉన్నార‌ని ప్ర‌కాష్ రాజ్ అన్నారు.