Begin typing your search above and press return to search.
ఆఖరుకు పిల్లలతో ప్రచారమా? మోడీని ఏకిపారేసిన ప్రకాష్ రాజ్
By: Tupaki Desk | 22 Nov 2022 11:30 AM GMTవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆది నుంచి బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఈ మేరకు ఆయన ట్వీట్లలో ఎండగడుతుంటారు. ముఖ్యంగా బీజేపీ హిందుత్వ రాజకీయాన్ని ఆయన విమర్శిస్తుంటారు. ఈక్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఏ సంఘటన జరిగినా కూడా ఆయన ట్విట్టర్ లో కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా మోడీ ఒక బాలికతో జరిపిన సంభాషణ వీడియోను కూడా షేర్ చేసి ప్రకాష్ రాజ్ ఎండగట్టారు.
ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ తీరికలేకుండా ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి సపోర్టుగా ఒక 8 ఏళ్ల బాలిక వచ్చింది. ఆ పాప భారతీయ జనతా పార్టీని కీర్తిస్తూ పలు మాటలు మాట్లాడింది. ఆమె మాటలకు ఫిదా అయిన ప్రధాని నరేంద్ర మోదీ 'శభాష్ భేటా' అంటూ మెచ్చుకున్నారు. బీజేపీ గురించి గొప్పగా చెప్పిన వీడియోను బీజేపీ, మోడీ షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. పలు ప్రసారసాధనాల్లో రావడంతో ట్రెండింగ్ లోకి వచ్చింది.
ఆ అమ్మాయి బీజేపీ అంటే అర్థం ఏంటి అన్న కోణంలో ఒక సుధీర్ఘ స్టేట్ మెంట్ ఇచ్చింది. దానితో బాగా ఆకట్టుకుంది. దక్షిణ భారత విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేసి "ఆఖరుకు పిల్లలను కూడా వదలరా? ప్రచారానికి పిల్లలను ఉపయోగించడం… ఎంత సిగ్గులేని పని .. " అంటూ విమర్శించాడు.
కొద్ది రోజుల క్రితమే తమ భారత్ జోడో యాత్రలో పిల్లలు పాల్గొన్నారని ఇదే బీజేపీ స్వయంగా కాంగ్రెస్ పై విరుచుకుపడింది. పిల్లలను వాడుకున్నందుకు కాంగ్రెస్ పార్టీని బీజేపీ నేతలు ఎగతాళి చేశారు. "పిల్లలను దుర్వినియోగం చేయడం ద్వారా కాంగ్రెస్ చట్టాన్ని ఉల్లంఘిస్తోంది, మేము చర్య తీసుకోవాలని ఈసీకి లేఖ రాశాం" అని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్పర్సన్ చెప్పారు.
మరి ఇప్పుడు గుజరాత్ ప్రచారంలో ఒక బాలిక బీజేపీ గురించి గొప్పగా చెప్పుకునే వీడియోను వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ చేస్తే తప్పు పట్టిన చైల్డ్ రైట్స్ కమిషన్ ఇప్పుడు బీజేపీ చేస్తున్న పనిని.. మోడీపై కూడా చర్య తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కూడా దీన్నే లేవనెత్తాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.