Begin typing your search above and press return to search.
ఆ ఫేక్ ట్వీట్ పై ప్రకాష్ రాజ్ ఘాటు రిటార్ట్!
By: Tupaki Desk | 29 Jan 2018 4:11 PM GMTగౌరీ లంకేశ్ హత్య తర్వాత ప్రకాశ్ రాజ్...మోదీ - బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడుతోన్న సంగతి తెలిసిందే. జస్ట్ ఆస్కింగ్ పేరుతో బీజేపీ నేతలపై, ప్రభుత్వంపై ట్విట్టర్ లో ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యాంగం నుంచి `సెక్యులర్` అనే పదాన్ని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేస్తామని కేంద్రమంత్రి అనంత కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ నిప్పులు చెరగడం.... దీంతో, ప్రకాష్ రాజ్ ప్రసంగించిన వేదికను బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు గోమూత్రంతో శుద్ధి చేయడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఆ తర్వాత ఓ సభలో ప్రసంగించిన ప్రకాశ్ రాజ్....తాను హిందువులకు ఏమాత్రం వ్యతిరేకం కాదని - కేవలం మోదీ - అమిత్ షా - హెగ్డేలకు మాత్రమే వ్యతిరేకమని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా, కొందరు ప్రకాష్ రాజ్ పేరుతో ఒక ఫేక్ పోస్ట్ ను ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు. దీంతో, ఆ పోస్ట్ తాను చేయలేదని, తనపై బురద జల్లేందుకు కొందరు ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు.
``పాకిస్థాన్ - బంగ్లాదేశ్ - కశ్మీర్ నుంచి చాలామంది హిందువులు తుడిచిపెట్టుకుపోయారు. ఆ హిందువులంతా మౌనంగా మరణించారు. ముస్లింల పై ప్రతీకారం తీర్చుకోలేదు. వారిని చూసి మిగతా హిందువులందరూ లౌకికవాదం - సహనం గురించి నేర్చుకోవాలి``అంటూ ప్రకాష్ రాజ్ కోట్ చేసినట్లు ఒక ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. అది ఫేక్ పోస్ట్ అని, దానిని తాను పోస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. తనపై కొందరు బురదజల్లేందుకు ఇటువంటి పోస్ట్ లు పెట్టి తద్వారా తాము ఎంత దిగజారామో, ఎంత నిరాశగా ఉన్నామో ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. తాను పెట్టిన ఒరిజినల్ పోస్ట్ ల పై అర్థవంతమైన చర్చలకు బదులు ఇటువంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడడం వారి అల్పబుద్ధికి నిదర్శనమన్నారు. అంతేకాదు, ఇటువంటి పిరికిపందలు పెట్టిన ఈ ఫేక్ పోస్ట్ ను లైక్ చేసి రీట్వీట్ చేయాలని కోరారు. అలా చేయడం ద్వారా ...సమాజంలో నిర్భయంగా బ్రతకాలనుకునేవారికి, సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రశ్నించేవారికి తమ మద్దతు ఎల్లపుడూ ఉంటుందని చాటి చెప్పాలని పౌరులకు పిలుపునిచ్చారు.