Begin typing your search above and press return to search.

కొద్ది గంట‌ల్లోనే.. మూడో ప్ర‌పంచ యుద్ధ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   12 May 2017 6:30 AM GMT
కొద్ది గంట‌ల్లోనే.. మూడో ప్ర‌పంచ యుద్ధ‌మ‌ట‌!
X
గుండెలు ద‌డ పుట్టేలా.. విన్నంత‌నే చెమ‌ట‌లు ప‌ట్టే జోస్యంగా దీన్ని చెప్పాలి. మాన‌వ వినాశ‌నానికి మారుపేరుగా చెప్పే మూడో ప్ర‌పంచ యుద్ధం ముంగిట్లోకి వ‌చ్చేసింద‌ని చెబుతున్నారు ప్ర‌ముఖ జ్యోతిష్యులు ప్ర‌మోద్ గౌత‌మ్‌. ఇలాంటి మాట‌లు గ‌తంలో చాలామంది చెప్పినా.. గౌత‌మ్ మాట‌ను అంత త్వ‌ర‌గా కొట్టిపారేయ‌లేమ‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలుస్తాడ‌న్న మాట‌ను బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పిన ఘ‌న చ‌రిత్ర అత‌గాడిది. అందుకే.. అత‌డి జ్యోతిష్య వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. కొత్త ఆందోళ‌న‌లకు గురి చేసేలా మారింది.

మూడో ప్ర‌పంచ యుద్ధానికి కార‌ణం కూడా చెప్పేసిన ప్ర‌మోద్‌.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చెప్పేశాడు. మే 13 నుంచి మూడో ప్ర‌పంచ యుద్ధం ప్రారంభం కానుంద‌ని.. కుజ‌గ్ర‌హ పీడితుడైన డొనాల్డ్ ట్రంప్‌.. అమెరికాను కాపాడుకునే ప్ర‌య‌త్నంలో తీవ్ర చ‌ర్య‌ల‌కు దిగుతాడ‌ని ఆయ‌న చెబుతున్నారు.

ఈ యుద్ధం పుణ్య‌మా అని.. ప‌శ్చిమం నుంచి తూర్పు దాకా భూగోళం క‌కావిక‌లం అవుతుంద‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. యుద్ధం రాకుండా ఉండేందుకు త‌న శిష్యుల‌తో క‌లిసి ఆగ్రా తీరంలోని య‌మునా తీరంలో శుక్ర‌వారం మ‌హాశాంతి యాగం చేయ‌టానికి ఏర్పాట్లు చేశారు. య‌మున ద‌గ్గ‌రే ఈ యాగం అంటే.. య‌మున సోద‌రుడు.. మృత్యువుకు అధిప‌తి అయిన య‌మ‌ధ‌ర్మ‌రాజును ప్ర‌స‌న్నం చేసుకోవ‌టం ద్వారా యుద్ధాన్ని నివారించొచ్చ‌న్న వాద‌న‌ను ఆయ‌న వినిపిస్తున్నారు.

మే 13 నుంచి సెప్టెంబ‌రు చివ‌రి వ‌ర‌కూ డోనాల్డ్ ట్రంప్ మీద కుజుడు తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తాడ‌ని.. ఆ స‌మ‌యంలోనే అమెరికా తీవ్ర హింస‌ను ఎదుర్కోనుంద‌ని చెబుతున్నారు. ట్రంప్ ప్ర‌తిచ‌ర్య‌గా తీసుకునే నిర్ణ‌యంతో మూడో ప్ర‌పంచ యుద్ధం మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప్ర‌మోద్ వేదిక్ సూత్రం అనే సంస్థ‌ను న‌డుపుతున్నారు. మూడో యుద్ధం గురించి ఇన్ని మాట‌లు చెప్పిన ఆయ‌న ద‌శాబ్దాల త‌ర‌బ‌డి సాగుతున్న క‌శ్మీర్ ఇష్యూలో దాయాదితో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు అంత‌కంత‌కూ పెరిగి.. త్వ‌ర‌లోనే పెను ఉప‌ద్ర‌వానికి దారి తీస్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. నిజం మాట ఎలా ఉన్నా.. ప్ర‌మోద్ జోతిష్యం విన్న వారంతా హ‌డ‌లిపోతున్న ప‌రిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/