Begin typing your search above and press return to search.
మోడీకి ప్రణబ్ చురకేశారా?
By: Tupaki Desk | 15 Aug 2016 6:54 AM GMTస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసే ప్రసంగం సాధారణంగా ఎక్కడా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వంలోని పెద్దలకు కానీ వ్యతిరేకంగా ఉండదు. కానీ.. ఈసారి మాత్రం రాష్ర్టపతి ప్రణబ్ ప్రసంగం ప్రధాని మోడీకి చిన్నచిన్న చురకలు వేసింది. ముఖ్యంగా దళితులు - బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను అరికట్టకుంటే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమగ్రత విలువలను దెబ్బతీసే ఈ తరహా విచ్చిన్నకర శక్తులను ఉపేక్షించ కూడదని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ లోని ఉనా ప్రాంతంతోపాటు పలుచోట్ల దళితులపై జరుగుతున్న జరిగిన దాడులు జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగించిన నేపథ్యంలోనే ఆయన ప్రసంగంలో ఈ అంశానికి స్థానమిచ్చినట్లుగా తెలుస్తోంది. అలాంటి ఘటనలకు పాల్పడిన వారిని ఉపేక్షించ కూడదని ప్రణబ్ ప్రత్యేకంగా చెప్పడం ప్రభుత్వానికి హితబోధ చేయడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇటీవ ప్రధాని మోడీ కూడా దళితులపై దాడులను ఖండించారు. నిజమైన గోరక్షకులెవరూ ఇలాంటి దాడులకు పాల్పడరని, వారంతా నకిలీలేనని స్పష్టం చేశారు. గోరక్షకులకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ – వీహెచ్ పీ మధ్య భేదాభిప్రాయాలకు కూడా దారి తీశాయి. తాజాగా రాష్ట్రపతి ప్రసంగంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించడం, ఈ తరహా దాడులను నిర్మూలించాలని ఆయన పిలుపునివ్వడం ఒకరకంగా దేశంలో దళితుల దయనీయ పరిస్థితికి అద్దం పట్టిందని, ఇది ఒకరకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రాష్ట్రపతి సుతిమెత్తగా హెచ్చరించడమేనని అంటున్నారు.
అయితే, రాష్ట్రపతి ప్రసంగమేమీ ఆయన స్వయంగా ఆయన ఇష్టాయిష్టాలనే ప్రతిబింబించదు. ప్రభుత్వం దానికి ఓకే చెప్పిన తరువాతే అది తొలుత మీడియాకు రిలీజ్ అవుతుంది. ఆ తరువాత స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ర్టపతి దాన్ని చదువుతారు. కాబట్టి ప్రణబ్ ప్రసంగం మోడీకి ముందే తెలుస్తుంది. కాబట్టి అది చురక అనేకంటే ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా ఉందనే భావన కలిగించడానికి.. రాష్ర్టపతి దీనిపై మాట్లాడారు కాబట్టి విపక్షాలు ఊరికే ఆందోళన చేయడం తగ్గుతుందన్న లెక్కల్లో ప్రసంగంలో ఆ అంశానికి చోటిచ్చి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.