Begin typing your search above and press return to search.
రాష్ట్రపతి గెస్టుగా నల్గొండ నేతన్న
By: Tupaki Desk | 24 March 2016 9:33 AM GMTనల్లగొండ జిల్లా షార్జీపేటకు చెందిన ఒక సామాన్య చేనేత కార్మికుడు పదిహేను రోజులుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అతిథిగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉంటున్నారు. ఈ నెల 12న రాష్ట్రపతి భవన్ లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో లక్ష్మి ఆశు యంత్రంను ప్రదర్శించడం కోసం షార్జీపేటకు చెందిన చింతకింది మల్లేశంకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ప్రదర్శన వారంరోజుల పాటే (19వ తేదీ వరకు) జరిగినా అప్పటి నుంచీ రాష్ట్రపతి భవన్ లోనే ఆయనకు రెండు వారాల పాటు ఆతిథ్యం అందుతోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు తయారుచేసిన యంత్రాలను ప్రదర్శించడంతో పాటు వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటైంది. దేశం నలుమూలల నుంచి 65 మంది గ్రామీణ శాస్త్రవేత్తలు తాము తయారు చేసిన ఉపకరణాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచారు. అయితే వీరిలో కేవలం ఏడుగురికి మాత్రమే రాష్ట్రపతి భవన్ లో ఆతిధ్యం పొందే అవకాశం లభించింది. శనివారం(26వ తేదీన) వీరందరికీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీడ్కోలు పలకనున్నారు. సామాన్యులకు సైతం రాష్ట్రపతి భవన్ అనుభూతిని అందజేయాలన్న ఉద్దేశంతో ఏడుగురు గ్రామీణ శాస్త్రవేత్తలకు - ఒక చిత్రకారుడికి - నలుగురు సాహితీవేత్తలకు రాష్ట్రపతి ఆతిథ్యం కల్పించారు.
కాగా రాష్ట్రపతి బుధవారం కొద్దిసేపు ముచ్చటించి వారితోనే గడిపారు. ప్రతిభను గుర్తించకపోతే ప్రగతి అనేది సాధ్యం కాదని ఈ సందర్భంగా రాష్ట్రపతి ఈ సందర్భంగా అన్నారు. సృజనాత్మకతను - నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి పొందుతున్న ఆతిథ్యంపై వారి అనుభూతి గురించి వాకబు చేశారు. రాష్ర్టపతి భవన్లో మర్యాదలు అద్భుతంగా ఉన్నాయని.. ఇలాంటి అవకాశం వస్తుందని ఎన్నడూ అనుకోలేదని మల్లేశం చెబుతున్నారు.