Begin typing your search above and press return to search.

మరింత విషమమైన ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి .. ట్విట్టర్ లో శర్మిష్ఠా ముఖర్జీ !

By:  Tupaki Desk   |   12 Aug 2020 11:30 AM GMT
మరింత విషమమైన ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి .. ట్విట్టర్ లో శర్మిష్ఠా ముఖర్జీ !
X
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షిణించింది. బ్రెయిన్ సర్జరీ తరువాత ఆసుపత్రిలోనే అయన చికిత్స తీసుకుంటున్నారు. అయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలని పలువురు ప్రముఖులు కోరుకుంటున్న సమయంలో, ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ, చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ప్రస్తుతం ప్రణబ్, న్యూఢిల్లీ లోని ఇండియన్ ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

శర్మిష్ఠా ముఖర్జీ చేసిన ట్విట్ లో .. ' గత సంవత్సరం ఆగస్టు 8. నా జీవితంలోని ఓ అత్యంత ఆనందకరమైన రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం ఆయన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఏడాది తిరిగేసరికి ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఇక నా తండ్రి భారం ఆ దేవుడిదే. తనవంతుగా ఏం చేయాలో ఆ భగవంతుడు అన్నీ చేయాలి. జీవితంలో ఏర్పడే సంతోషాన్ని, కష్టాలను సమానంగా స్వీకరించేలా నాకు బలాన్నివ్వాలి. మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని ఆమె ట్వీట్ చేశారు.

మాజీ రాష్ట్రపతికి బ్రెయిన్ సర్జరీ జరిగిన తరువాత, వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాస్పిటల్ కు వెళ్లి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే , ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ సర్జరీకి ముందు నిర్వహించిన వైద్యపరీక్షలలో ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ సొంత గ్రామంలో అయన కోలుకోవాలని, మహా మృత్యుంజయ హోమాన్ని గ్రామస్థులు నిర్వహిస్తున్నారు.