Begin typing your search above and press return to search.
మొన్న ఆ చంద్రుడు.. నేడు ఈ చంద్రుడు
By: Tupaki Desk | 5 July 2015 9:46 AM GMTఒకేలాంటి ఘటనలు జరగటం కాస్తంత అరుదు. ఇక.. ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించి.. ఒక అతిధి విషయంలో ఒకేలాంటివి చోటు చేసుకోవటం కాస్తంత ప్రత్యేకమే. తాజాగా చోటు చేసుకున్న ఘటన అలాంటిదే.
వర్షాకాలం విడిది కోసం భారతదేశ రాష్ట్రపతి దక్షిణాదికి వచ్చిన ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లోని బల్లారంలో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే తిరుమలకు వెళ్లిన రాష్ట్రపతికి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి ఏర్పాట్లు చేయటంతో పాటు.. మర్యాదలకు ఏ మాత్రం లోటు లేకుండా చేయటం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు వచ్చే ప్రముఖులు ఎవరైనా సరే.. తిరుమలకు వెళ్లి.. దర్శనం చేసుకోవటం ఒక అలవాటుగా మారటం తెలిసిందే.
విభజన తర్వాత.. ఏపీకి తిరుమల ఎలానో.. తెలంగాణకు యాదగిరిగుట్ట.. ఇప్పుడు పేరు మారిన యాదాద్రిని ఫేమస్ చేయటంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న కేసీఆర్.. రాష్ట్రపతిని వెంట బెట్టుకొని మరీ ఆదివారం యాదాద్రికి తీసుకెళ్లారు.
తిరుమల పర్యటనలో ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తండ్రితో పాటు రాగా.. యాదాద్రికి కూడా ఆయన తండ్రితో పాటు హాజరయ్యారు. ఈ రెండు పర్యటనల్లో రాష్ట్రపతి పక్కన ఉండి.. అలాంటి మర్యాదలు పొందిన ఒకే ఒక వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌గా చెప్పాలి.
తిరుమలలో స్వామివారి దర్శనం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి ఏర్పాట్లు చేశారో.. యాదాద్రిలోనూ అంతే ఘనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాట్లు చేసి.. రాష్ట్రపతి మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి.. రోజుల వ్యవధిలో ఒకేలాంటి మర్యాదల్ని ఇద్దరు చంద్రుళ్ల చేత పొందటం రాష్ట్రపతి ప్రణబ్‌కే దక్కిందని చెప్పక తప్పదు.