Begin typing your search above and press return to search.

జైల్లో చచ్చిపో..చంపేస్తారు..ప్రణయ్ తమ్ముడి ఆవేదన

By:  Tupaki Desk   |   16 Sept 2018 4:46 PM IST
జైల్లో చచ్చిపో..చంపేస్తారు..ప్రణయ్ తమ్ముడి ఆవేదన
X
నల్గొండ జిల్లా మిర్యాల గూడలో కూతురు కులాంతర వివాహం చేసుకున్నందుకు అల్లుడిని చంపించిన మామ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. తాజాగా చనిపోయిన ప్రణయ్ అంత్యక్రియలకు ఆయన తమ్ముడు అజయ్ ఉక్రెయిన్ దేశం నుంచి ఈరోజు వచ్చాడు. మిర్యాల గూడలోని తన ఇంటికి చేరుకొని బోరున విలపించాడు. వదిన అమృత - అన్నయ్య మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. అజయ్ రాకతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అజయ్ తన ఆవేశాన్ని వెల్లగక్కాడు.

అజయ్ మాట్లాడుతూ.. ‘ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు చంపేస్తారా’ అని నిలదీశారు. తమ అన్నను చంపించిన వదిన నాన్న , బాబాయ్ శ్రావణ్ లను ప్రజలే చంపేస్తారని హెచ్చరించాడు. ఇంతటి సైకో తండ్రిని తాను ఎక్కడా చూడలేదన్నారు. వదిన అమృతకు ఆమె తల్లి ఎప్పటికీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని పక్కా ప్లానింగ్ తోనే తన అన్నయ్యను చంపించారని అజయ్ ఆరోపించారు. ఇది కక్ష మాత్రమే కాదని.. నమ్మకద్రోహం కూడా అని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో చేసింది ఈ హత్య అని వాపోయాడు. అందరూ కలిసి చంపేశారని ఆరోపించారు. తన అన్నయ్య వరుస బెదిరింపు వచ్చాయని.. ఇప్పడు ఆ బెదిరింపులే నిజమయ్యాయని వాపోయాడు.

‘వాళ్లకు కోట్ల రూపాయలున్నా.. ఎంత పరపతి ఉన్నా చూపించుకోండి.. జనాలు మాత్రం నిన్ను చంపేస్తారు’ అంటూ అజయ్ నిందితులకు హెచ్చరికలు జారీ చేశాడు. మీ ఫ్యామిలీలో ఎవరూ మిగలరని స్పష్టం చేశారు. నువ్వు జైల్లోనే చచ్చిపో .. బయటకు వస్తే చంపేస్తారు అంటూ హెచ్చరించారు.

చనిపోయిన ప్రణయ్ భార్య అమృత మాట్లాడుతూ .. తన తండ్రి నా ఎదురుగా వచ్చి క్షమించమన్నా.. తాను చంపేస్తానని చెప్పారు.మా నాన్న - బాబాయి సైకోలు అని అన్నారు. తనకు తన బిడ్డకు పోలీస్ రక్షణ కావాలని కోరింది. మిర్యాల గూడ సెంటర్ లో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నా బిడ్డను తానే పెంచుకుంటానని.. పుట్టింటికి వెళ్లనని అమృత వాపోయింది.