Begin typing your search above and press return to search.
నాన్నను చూడాలన్న అమృత.. నో చెప్పిన తల్లి.. బాబాయ్
By: Tupaki Desk | 9 March 2020 5:45 AM GMTఒక ప్రేమ.. రెండు కుటుంబాల్లో పెట్టిన చిచ్చు.. ఆ కారణంగా చోటు చేసుకున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీశాయి. చిన్నతనం నుంచి ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడేందుకు అమృత పడిన తపన.. పెద్దల మాటకు భిన్నంగా పెళ్లి చేసుకున్న వైనం.. చివరకు ఆమె తండ్రి మారుతిరావుకు ఆగ్రహావేశాలు తెప్పించి.. హత్య చేయించే వరకూ వెళ్లటం తెలిసిందే.
దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. నిన్న (ఆదివారం) హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు లాడ్జిలో మారుతిరావు ఆత్మహత్య చేసుకోవటంతో అందరూ షాక్ తిన్నారు. కుమార్తెను పిచ్చిగా ప్రేమించే తండ్రి.. ఆమె ప్రేమను చంపేందుకు సైతం వెనుకాడని వ్యక్తి.. ఆత్మహత్య చేసుకోవటమా? అన్న ప్రశ్న అందరిలో వ్యక్తమైంది.
కసిగా సంపాదన మొదలు పెట్టి.. అనుకున్నట్లే కోట్లాది రూపాయిలు సంపాదించినా.. ఎలాంటి సుఖం లేని తీరుపూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన సూసైడ్ నోట్ లో భార్యకు క్షమాపణలు చెప్పి.. తల్లి దగ్గరకు కుమార్తె వెళ్లిపోవాలంటూ మారుతిరావు అభ్యర్థన చేయటం తెలిసిందే. తన తండ్రి ఆత్మహత్య కు సంబంధించిన అధికారిక సమాచారం ఏమీ రాలేదని.. టీవీ చానళ్లలో చూసి తెలుసుకున్నట్లుగా చెప్పింది అమృత. తన భర్తను చంపిన వేదనతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పేర్కొంది.
తాజాగా తన తండ్రిని కడసారి చూసేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తన తండ్రిని చూసేందుకు పోలీసుల భద్రతను కోరారు. అయితే.. తండ్రిని చూసేందుకు వస్తానన్న అమృత విన్నపాన్ని ఆమె తల్లి గిరిజ.. బాబాయ్ శ్రవణ్ లు అంగీకరించలేదు. ఇదిలా ఉంటే.. మిర్యాలగూడ లో మారుతిరావు అంతిమయాత్ర ఈ ఉదయం మొదలు కానుంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తన తల్లి.. బాబాయ్ లు అంగీకరించని వైనంపై అమృత ఎలా స్పందిస్తుందో చూడాలి.