Begin typing your search above and press return to search.
నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు - పీవీపీ
By: Tupaki Desk | 21 March 2019 12:47 PM GMTవిజయవాడ లోక్ సభ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు ప్రముఖ వ్యాపారవేత్త పీవీపీ. విజయవాడ ఎంపీ అవ్వడం అనేది డ్రీమ్. దీనికోసం దాదాపు పదేళ్లనుంచి కష్టపడుతున్నారు. అనుకోకుండా ఇన్నాళ్లుక ఆయనకు అవకాశం దక్కింది.దీంతో.. విజయవాడలోనే మకాం పెట్టి ప్రచారంలో దిగిపోయారు. అయితే అనుకోకుండా ఆయనపై ఒక దుమారం రేగింది. ప్రత్యేక హోదా అనేది బోరింగ్ సబ్జెక్ట్ ని - దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ ఆయన సీఐఐ సదస్సులో మాట్లాడారు. ఇది కాస్తా వైరల్ అయిపోవడంతో.. బాగా విమర్శలు ఎదుర్కున్నారు. అయితే తాను మాట్లాడిన అర్థం వేరని - మీడియా మాత్రం బోరింగ్ సబ్జెక్ట్ అనే వాఖ్యమే తీసుకుందని విమర్శించారు.
“నేను నిన్న సాయంత్రం సీఐఐ సదస్సులో మాట్లాడాను. మొదటగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇచ్చే ఏకైక పార్టీ వైసీపీ. దానికోసమే మా నాయకుడు ఐదేళ్ల నుంచి కష్టపడుతున్నారు. మా ఎంపీలు రాజీనామాలు కూడా చేశారు. ఇక నేను అటెండ్ అయిన మీటింగ్ లో అప్పటికే అందరూ అదే అంశంపై మాట్లాడాను. దీంతో నేను బోరింగ్ అనే వ్యాఖ్యలు చేశాను. ఎవరికి ఏదైనా సందేహం ఉంటే వీడియో తెప్పించుకుని చూసుకోవచ్చు. నాకు ఇప్పటికే క్లియర్ స్టాండ్ ఉంది. రాష్ట్రంలో హోదా సాధించే ఏకైక నాయకుడు జగన్” అని అన్నారు పీవీపీ. టీడీపీ వాళ్లు - వారి అనుకూల మీడియా తన వ్యాఖ్యల్ని వారికి కావాల్సినంత మాత్రమే తీసుకుని ఎడిటింగ్ చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు పీవీపీ.