Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే రాజీ...నామా
By: Tupaki Desk | 24 Jun 2015 11:18 AM GMTవైఎస్సార్సీపీలో మరో సంక్షోభం చెలరేగి చల్లారింది. నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి జిల్లా సారథ్య బాధ్యతలకు రాజీనామా చేశారని ఓ మీడియా ఛానల్లో వార్తలు వచ్చాయి. సదరు రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా అందజేశారని ఆ వార్తల్లో ప్రస్తావించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వర్గంతో పొసగకే నల్లపురెడ్డి వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారని వివరించారు.