Begin typing your search above and press return to search.
చంద్రబాబును ఏకేసిన సుప్రీంకోర్టు లాయర్
By: Tupaki Desk | 13 Dec 2016 6:49 AM GMTఏపీ సీఎం చంద్రబాబు నాయుడంటే ఢిల్లీ స్థాయిలో నేతలకే కాదు మేధావి వర్గాలు - సామాజిక రంగానికి చెందినవారిలో స్పెషల్ ఇమేజ్ ఉంది.. ఆ ఇమేజ్ ఇప్పుడు కొత్త టర్ను తీసుకుంటోంది. సరికొత్త ఇమేజి ఇప్పటికే క్రియేట్ అయిపోయిందట. చంద్రబాబు అంటే సెల్ఫ్ డబ్బాకు మారుపేరని ఢిల్లీలో అనుకుంటున్నారు. చంద్రబాబు జర్నలిస్టులను తనకు అనుకూలంగా మలచుకుని వారి సహాయంతో సొంత డబ్బా వాయించుకుంటున్నారని ప్రముఖ సామాజికవేత్త - సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ లో ఏకిపడేశారు. జర్నలిస్టులను చంద్రబాబు ఎలా వాడుకుంటున్నారో కూడా ఆయన చెప్పుకొచ్చారు.
చంద్రబాబు తన సొంత డబ్బా వాయించుకునేందుకు ఇటీవల 25 మంది జర్నలిస్టులను నియమించుకున్నారు. చంద్రబాబును పొగుడుతూ కథనాలు సిద్ధం చేయడం - బాబుకు పాజిటివ్ గా స్టోరీలు రాసి వాటిని జాతీయ మీడియాకు చేరవేసి దేశం మొత్తం మీద చంద్రబాబు గ్రేట్ అనిపించడం ఈ జర్నలిస్టుల టీం పని. 25 మందికి ఒక్కొక్కరికి ఏకంగా 51 వేల 468 రూపాయల జీతం చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చంద్రబాబు ఇలా జర్నలిస్టులను తన డబ్బా వాయించేందుకు ఉపయోగించడంపై ప్రశాంత్ భూషణ్ తీవ్రంగా స్పందించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు అధికారికంగానే జర్నలిస్టులకు లంచాలు ఇస్తున్నారు చూడండి అంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని ట్వీట్ చేశారు. 25 మంది జర్నలిస్టులకు చంద్రబాబు అధికారికంగానే లంచాలు ఇస్తున్నారంటూ ట్వీట్ లో ఫైర్ అయ్యారు ప్రశాంత్ భూషణ్. మరి మన సీఎం సాబ్ ఇప్పటికైనా సిగ్గు పడతారో లేదో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/