Begin typing your search above and press return to search.
షర్మిల అక్కను ప్రశాంత్ భయ్యా పట్టించుకోలేదా..!
By: Tupaki Desk | 4 Dec 2021 2:36 PM GMTవైఎస్ షర్మిల కొత్త పార్టీ తెలంగాణలో ఏ తీరానికి చేరుతుందో ? కూడా అర్థం కాని పరిస్థితి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు తాను వైయస్సార్ తెలంగాణ పార్టీని పెట్టా అని చెప్తున్నా.. ఆమెను ఇప్పటి వరకు అయితే ఎవరూ పట్టించుకోని పరిస్థితి. అసలు షర్మిల గురించి, ఆమె పార్టీ గురించి తెలంగాణ మీడియాలో ఏ మాత్రం కవరేజ్ లేదంటే ఆమె పార్టీకి అక్కడ అ ఏ స్థాయిలో క్రేజ్ ఉందో తెలుస్తోంది. అసలు మీడియానే పట్టించుకోకపోతే... ఇక తెలంగాణ ప్రజలు మాత్రం షర్మిల పార్టీని ఎందుకు ? గుర్తిస్తారు ? ఎందుకు పట్టించుకుంటారు ? అన్న ప్రశ్నకు ఆమె ఆన్సర్ చేయాలి. పార్టీ పెట్టిన కొత్తలో షర్మిల కేసీఆర్ విషయంలో ఆచితూచి విమర్శలు చేసేవారు.
అయితే ఇప్పుడు ఆమె విమర్శల డోస్ పెంచినా కూడా అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. అసలు ఆమె విమర్శలకు కౌంటర్లు ఇస్తే తమ టైం వేస్ట్ అన్నట్టుగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తనకు సపోర్ట్ చేస్తున్నారు అని... ప్రశాంత్ భయ్యా తన పార్టీకి కన్సల్టెంట్‌గా పని చేసేందుకు తనకు మాట ఇచ్చారు అని షర్మిల గతంలో పదేపదే చెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తన అన్న జగన్ మోహన్ రెడ్డిని బంపర్ మెజారిటీతో అధికారంలోకి తీసుకు రావడంలో ప్రశాంత్ కిషోర్ కీలకపాత్ర పోషించారు.
దేశంలోనే ఎవ్వరూ ఊహించని విధంగా జగన్ 151 సీట్లు అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ క్రేజ్ మరింతగా పెరిగింది. దీనికి తోడు తమిళనాడులోనూ ఆయన స్టాలిన్‌కు పీకే పనిచేశారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఇటీవల బెంగాల్లో మమతా బెనర్జీ అఖండ విజయంతో మూడోసారి ముఖ్యమంత్రి అవటంలోనూ ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు పనిచేశాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి దూకుడుగా వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అంత వీజీ కాదు.
ఈ క్రమంలోనే పీకేను ఇప్పుడు టీఆర్ఎస్ తమ స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకుంది. పీకే టీం కూడా తెలంగాణలో వర్క్ స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరి నిన్నటి వరకు షర్మిల పీకే తన పార్టీకి పని చేస్తున్నారు అని చెప్పుకున్నారు. మరి ఇంతలోనే ఆయన టీఆర్ఎస్‌కు పని చేస్తుండడంతో ఏం జరిగింది ? వీరి మధ్య తేడా ఎక్కడ కొట్టింది ? అసలు వీరి డీల్ కుదిరిందా ? లేదా ఆమే చెప్పారా ? అన్నది అంతు పట్టడం లేదు.
లేదా తెలంగాణలో షర్మిల పార్టీకి పనిచేసినా.. చేయకపోయినా ఎలాగూ ఓడిపోతుందని.. అలాంటి పార్టీకి పనిచేసి పరువు పోగొట్టుకోవడం కంటే గెలిచే టీఆర్ఎస్‌కే పని చేస్తే కరెక్ట్ అని పీకే తన నిర్ణయం మార్చుకున్నారా ? అన్నది ఎవ్వరికి అంతు పట్టడం లేదు. మరి షర్మిలే దీనికి ఆన్సర్ చేయాలి.