Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత్ కిషోర్.. గెలిచే గుర్రాన్నే ఎక్కుతున్నాడు!

By:  Tupaki Desk   |   11 Feb 2020 7:30 PM GMT
ప్ర‌శాంత్ కిషోర్.. గెలిచే గుర్రాన్నే ఎక్కుతున్నాడు!
X
ఏపీలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌న విజ‌యం ఎంతో కొంత త‌న ఖాతాలో వేసుకున్నాడు ఐప్యాక్ ప్ర‌శాంత్ కిషోర్. ఏపీలో జ‌గ‌న్ కు ఊపున్న వేళ ఆయ‌న‌కు తోడై.. ఆ విజ‌యంలో భాగ‌స్వామ్యం పొందాడు ఈ పొలిటిక‌ల్ ఎన‌లిస్ట్! ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్ట‌రీతో మ‌రికొంత‌మంది రాజ‌కీయ నేత‌ల క‌ళ్లు ప్ర‌శాంత్ కిషోర్ మీద ప‌డ్డాయి. అది కూడా గెలుపుకు ద‌రిదాపుల్లో ఉన్న వాళ్లే పీకే మీద క‌న్నేశారు. అలాంటి వారిలో ఆప్ క‌న్వీన‌ర్ - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

వ‌ర‌స‌గా రెండో సారి పార్టీని గెలిపించుకుని సీఎం కావాల‌నే ల‌క్ష్యంతో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప్ర‌శాంత్ కిషోర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు కేజ్రీవాల్. ఆయ‌న పాల‌న మీద మ‌రీ వ్య‌తిరేక‌త లేదు - అలాగే అవినీతి మ‌ర‌క‌లు లేవు, బీజేపీ - కాంగ్రెస్ ల‌కు స‌రైన స్థానిక నాయ‌కత్వం లేదు.. అదీ ఢిల్లీలో ప‌రిస్థితి. అలాంటి ప‌రిస్థితుల్లో ఆప్ కు స‌ల‌హాదారుగా చేరాడు పీకే. కానీ ఆయ‌న కొన్ని కీల‌క‌మైన స‌ల‌హాలు ఇచ్చాడ‌ట‌.

అందులో ముఖ్య‌మైన‌ది జాతీయ రాజ‌కీయాల వ్య‌వ‌హారాల్లో నోరు ఎత్త‌వ‌ద్ద‌ని - అన‌వ‌స‌రంగా త‌ల‌దూర్చ‌వ‌ద్ద‌ని కేజ్రీవాల్ కు స‌ల‌హా ఇచ్చింది ప్ర‌శాంత్ కిషోరేన‌ట‌. ఢిల్లీకి ప‌రిమితం కావాల‌ని - ఢిల్లీపై ప‌ట్టు నిలుపుకోవ‌డానికి అనుస‌రించాల్సిన వ్యూహాల్లో నేష‌న‌ల్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్ట‌క‌పోవ‌డం ఒక‌ట‌ని కేజ్రీవాల్ కు సూచించాడ‌ట పీకే. ఆ స‌ల‌హాను ఆయ‌న పాటించ‌డం - ఇప్పుడు ఘ‌న విజ‌యం సాధించ‌డం జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో పీకే కు క్రేజ్ మ‌రింత పెరిగింది. అత‌డిని ఒక ల‌క్కీ ఛార్మ్ గా భావించాల్సి వ‌స్తోంది. మోడీ - నితీష్ కుమార్ - వైఎస్ జ‌గ‌న్ - కేజ్రీవాల్.. ఇలా వీళ్లంద‌రి విజ‌యం వేళ వారితో పీకే క‌నిపించాడు. ఇక ఇప్ప‌టికే మ‌మ‌తా బెన‌ర్జీ - స్టాలిన్ ల దృష్టి కూడా పీకే మీద ప‌డింది. వారు కూడా ఒప్పందాలు చేసేసుకున్నార‌ని తెలుస్తోంది.

వారిద్ద‌రికీ పాజిటివ్ సైన్సే క‌నిపిస్తున్నాయి. త‌మిళ‌నాట అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే విజ‌యానికే ఎక్కువ అవ‌కాశాలున్నాయి. ఇక బీజేపీ వాళ్లు ఎంత పోరాడినా ప‌శ్చిమ బెంగాల్ లో మ‌మ‌త‌ను ఓడించ‌డం అంటే మాట‌లు కాదు. ఇదే స‌మ‌యంలో పీకే కూడా వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని చెప్ప‌వ‌చ్చు. కొద్దో గొప్పో ఊపు ఉన్న వాళ్ల ప‌క్క‌న‌, గెలుపు ఖాయ‌మైన వారి వైపున చేరుతూ.. వారి విజయానికి కొద్దో గొప్పో స‌ల‌హాలు ఇచ్చి, చాలా క్రెడిట్ ను త‌న ఖాతాలో వేసుకుంటూ ప‌క్కా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌లా సాగుతున్నాడు! ఏదేమైనా ప్ర‌స్తానికి ప్ర‌శాంత్ కిషోర్ ఒక ల‌క్కీ చార్మ్!