Begin typing your search above and press return to search.

బీహార్ నుంచి ఆ రాష్ట్రానికి ఓటు మార్చుకున్న ప్రశాంత్ కిషోర్.. కారణమిదే

By:  Tupaki Desk   |   26 Sep 2021 8:41 AM GMT
బీహార్ నుంచి ఆ రాష్ట్రానికి ఓటు మార్చుకున్న ప్రశాంత్ కిషోర్.. కారణమిదే
X
దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఏపీ సీఎం జగన్ నుంచి తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరకూ అందరి వెనుకుండి నడిపించి గెలిచిన రాజకీయ మేధావి. అలాంటి ప్రశాంత్ కిషోర్ (పీకే) ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనుక ఏదో అర్థం పరమార్థం ఉండి తీరుతుంది. ఇప్పుడు అదే జరిగింది.

బీహార్ కు చెందిన పీకే తాజాగా తన సొంత రాష్ట్రంలో బీహార్ లోని సొంత గ్రామమైన ససరామ్ జిల్లా నుంచి తన ఓటు హక్కును పశ్చిమ బెంగాల్ కు మార్చుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా దక్షిణ లోక్ సభ స్థానంలోకి ఓటును మార్చుకోవడం సంచలనమైంది.

పీకే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోవిడ్ కాలంలో టీఎంసీకి వ్యూహకర్తగా పనిచేశారు. అప్పుడు ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ ఇంట్లోనే ప్రశాంత్ ఉన్నాడు. అదే అడ్రస్ పైనే ఆయన ఓటుహక్కును తీసుకున్నారు. ఓటును మార్చుకోవడం వెనుక ప్రశాంత్ కిషోర్ భారీ వ్యూహమే ఉందని అంటున్నారు.

మమతా బెనర్జీ మోడీకి పోటీగా దేశ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఒకవేళ థర్డ్ ఫ్రంట్, కాంగ్రెస్ కలిసి అధికారం సాధిస్తే పశ్చిమ బెంగాల్ సీఎంగా పీకేకు అవకాశం దక్కొచ్చు. మమత వెనుకాల ఉండి నడిపిస్తున్న పీకేకు బెంగాల్ సీఎం పోస్టును మమత ఇచ్చి తను పీఎం పోస్టులో కూర్చోవచ్చు. ఈ ఖ్రమంలోనే ప్రశాంత్ కిషోర్ తన ఓటు హక్కును బెంగాల్ కు మార్చుకున్నాడని ఊహాగానాలు వెలువుడుతున్నాయి.

అయితే ఇప్పటికే తన సంస్థ 'ఐపాక్' ద్వారా రాజకీయ వ్యూహాలను అందిస్తున్న పీకే.. టీఎంసీ తరుఫున పోటీచేస్తారా? లేదా అనేది స్పష్టం కాలేదు.

ఇటీవలే దేశంలో మోడీని, బీజేపీని ఓడించాలని పీకే కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు. సోనియా, రాహుల్, మమతలతో కలిసి భేటి అవుతూ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీకే అడుగులు బెంగాల్ వైపు పడడం ఖచ్చితంగా మమతను జాతీయ రాజకీయాల్లోకి పట్టుకురావడమేనని అంటున్నారు.