Begin typing your search above and press return to search.

ప్రశాంత్ కిషోర్ మాజీ అనుచరుడు..టీడీపీ స్ట్రాటజిస్టుగా?

By:  Tupaki Desk   |   23 Sep 2019 8:53 AM GMT
ప్రశాంత్ కిషోర్ మాజీ అనుచరుడు..టీడీపీ స్ట్రాటజిస్టుగా?
X
అధికారం కోల్పోగానే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ ను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మళ్లీ పుంజుకోవడానికి అనుగుణంగా ప్రశాంత్ కిషోర్ టీమ్ సేవాలను చంద్రబాబు నాయుడు వాడుకోవాలని ఫిక్సయినట్టుగా అప్పట్లోనే వార్తలు వచ్చాయి. పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పీకే సంపాదించుకున్న పేరేమిటో చెప్పనక్కర్లేదు. ఆయన ఎవరి కోసం పని చేస్తే వారు గెలిచేస్తారనే ప్రచారం వచ్చింది.

జగన్ పార్టీ ఏపీలో సాధించిన విజయంలో పీకే చాలా క్రెడిట్ ను పొందాడు. ఇలాంటి క్రమంలో పీకేతో ఒప్పందం కోసం చంద్రబాబు ప్రయత్నం చేశారట. అయితే అది కుదరలేదని సమాచారం. ఎన్నికల తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి పీకేతో ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారని టాక్. ఆ సంగతేమో కానీ..ఇప్పుడు టీడీపీ ఒక స్ట్రాటజిస్టును నియమించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అతడి పేరు రాబిన్ శర్మ అట.

ఇది వరకూ ఈయన పీకే కు సంబంధించిన ఐప్యాక్ లోనే పని చేశాడని సమాచారం. అక్కడ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు సొంతంగా పొలిటికల్ కన్సల్టెంట్ గా అవతారం ఎత్తాడట. ఇతడికి టీడీపీ భారీ ఆఫర్ కూడా ఇచ్చిందని టాక్. ఏకంగా యాభై కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇప్పటికే ఈ రాబిన్ శర్మ అనే వ్యక్తి పని కూడా ప్రారంభించాడట. టీడీపీ వార్తలను మీడియాకు రెగ్యులర్ అప్ డేట్స్ కూడా ఈయన ఇస్తున్నారట. ఈ విషయాన్ని టీడీపీ ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.